Main Menu

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the love

ఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లి ప్ర‌చారం నిర్వ‌హించింది. తెలంగాణా ఎన్నిక‌ల్లో కూట‌మి క‌ట్టి పోటీ చేసింది. అండ‌మాన్ లో కూడా టీడీపీ బ‌రిలో నిలిచింది. తాజాగా ఒడిశా వైపు చూస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ ఒడిశాలో 52 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తుందని ఒడిశా టీడీపీ చీఫ్ రాజేశ్ పుత్ర తెలిపారు. ఈ ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న తెలుగు జనాభా ఈసారి టీడీపీకే పట్టం కట్టబోతోందని వ్యాఖ్యానించారు.

కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని రాజేశ్ తెలిపారు. మొత్తం ఐదు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని, వీటిలో కోరాపుట్, నబరంగ్ పూర్, బెహ్రమ్ పూర్, అస్కా లోక్ సభ స్థానాలను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందని, పోటీ చేసే మరో స్థానాన్ని ఎంపిక చేయాల్సి ఉందని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతామని రాజేశ్ పేర్కొన్నారు.

ఒడిశాలో పోటీచేసే టీడీపీ అభ్యర్థులను త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేస్తారని వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయమై అధికార బీజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ స్పందిస్తూ.. ఒడిశాలో టీడీపీ ప్రభావం ఉండబోదని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. టీడీపీ పోటీతో బీజేడీ ఓట్లు చీలుతాయనీ, తమకు లాభం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ఒడిశా అసెంబ్లీలో 147 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 74 స్థానాలు కావాలి.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *