టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి

tdp mp
Spread the love

ఏపీ రాజ‌కీయాలు హాట్ టాపిక్ గా మారుతోంది. కేంద్రం దిగివ‌చ్చే అవ‌కాశం లేద‌ని తాజాగా జైట్లీ ప్ర‌క‌ట‌నతో తేలిపోయింది. దాంతో టీడీపీ రాజ‌కీయంగా తాము న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తోంది. ముఖ్యంగా మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల పాటు ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం ముగియ‌గానే ఆర్థిక మంత్రి మీడియా ముందుకు వ‌చ్చి అస‌లు సాధ్యం కాద‌ని చెప్పి నీరుగార్చేయ‌డంతో ఏదో నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం టీడీపీకి అనివార్యం అయ్యింది. దాంతో టీడీపీ త‌లాక్ చెప్ప‌డానికి సిద్ధ‌ప‌డింది. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణ‌యం తీసుకుంది

జైట్లీ ప్రెస్ మీట్ త‌ర్వాత అందుబాటులో ఉన్న మంత్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన చంద్ర‌బాబు, పార్టీ ఎంపీల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ కూడా నిర్వహించారు. ఆఖ‌రికి కేంద్రం నుంచి బ‌య‌ట‌కు రావాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఢిల్లీలో ఉన్న కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు మాత్రం అందుబాటులోకి రాక‌పోవ‌డం ఆస‌క్తిగా మారింది. కేవ‌లం సుజానా చౌద‌రి మిన‌హా అశోక్ మంత్రి సీఎంకి అందుబాటులోకి రాక‌పోవ‌డంతో టీడీపీ వ‌ర్గాలు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నాయి. కేంద్ర క్యాబినెట్ నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ అశోక్ రాజీనామా చేయ‌క‌పోతే ఏమ‌వుతుందోన‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. అయితే చివ‌ర‌కు ఆయ‌న కూడా చంద్ర‌బాబు మాట‌తో రాజీనామా చేసే అవ‌కాశాలున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా ఏపీ రాజ‌కీయాల్లో ఇదో కొత్త మ‌లుపుగా భావించ‌వచ్చు.


Related News

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the loveఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

pawantt_4127

త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిప్రాయానికి,Read More

 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • చంద్ర‌బాబుని అవ‌మానిస్తున్న హ‌స్తిన‌!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *