టీడీపీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని..!

varla ramaiah
Spread the love

నిజ‌మేన‌ట‌..ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని కూల్చేసే కుట్ర జ‌రుగుతోంద‌ట‌. ఈ విష‌యాన్ని టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య బ‌య‌ట‌పెట్టారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెరవెనుక పెద్ద కుట్ర జ‌రుగుతోంద‌ని వాపోయారు. టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే వ్యూహంతో ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ మాదిరిగానే ప్ర‌శాంత్ కిషోర్ కి కూడా క్రిమిన‌ల్ చ‌రిత్ర ఉంద‌న్నారు. యూపీలోనే ప్ర‌శాంత్ కిషోర్ మీద ఏడు క్రిమిన‌ల్ కేసులున్నాయ‌ని వెల్ల‌డించారు. అఖిలేష్ యాద‌వ్ ని పీకే మోస‌గించార‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు ఏపీలో సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ , ప్ర‌శాంత్ కిషోర్ మీద కేసులు న‌మోదు చేసి, ఇద్ద‌రి మీద డీజీపీ నిఘా పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ఇద్ద‌రూ క‌లిసి కుట్ర‌ప‌నుతున్నార‌ని ఆరోపించారు.

ఇక మంత్రి గంటా కూడా అదే స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్ డీఎన్ఏలోనే ఉన్మాదం ఉంద‌న్నారు. మాన‌సిక స్థితి బాగోలేని ఉన్మాదిలా వ్య‌వ‌హ‌రిస్తున్న అత‌డిని జ‌నంలో తిర‌గ‌నివ్వ‌కూడ‌ద‌న్నారు. విశాఖ ఆస్ప‌త్రిలో చేరితే వైద్యం ఖ‌ర్చులు భ‌రిస్తామ‌న్నారు. జ‌గ‌న్ తీరు మార్చుకోక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విప‌క్ష హోదా కూడా మిగ‌ల‌ద‌న్నారు.

మొత్తంగా నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. దాంతో వైసీపీ, టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. హ‌ద్దులు మీరిన నేత‌లు నోటికి ప‌నిచెప్ప‌డం మాత్రం ఆప‌డం లేదు.


Related News

shivaji

శివాజీ కామెంట్స్ చుట్టూ ర‌చ్చ‌

Spread the loveఅప‌రేష‌న్ గ‌రుడ‌..ఆప‌రేష‌న్ ద్రావిడ‌..రెండు రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశాలుగా మారాయి. దానికి కార‌ణం సినీ న‌టుడు శివాజీRead More

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the loveఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

 • త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్
 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *