Main Menu

టీడీపీ ఎమ్మెల్యేకి హైకోర్ట్ షాక్

Spread the love

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి హైకోర్ట్ షాకిచ్చింది. మైనింగ్ వ్య‌వ‌హారాల్లో సీనియ‌ర్ ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయ్యింది. గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై మైనింగ్‌ ఆరోపణల వ్యవహారంలో తీవ్ర వాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్‌ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్‌ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్‌, కేంద్ర మైనింగ్‌ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.

దాంతో య‌ర‌ప‌తినేని వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. య‌ర‌ప‌తినేనిపై చాలాకాలంగా మైనింగ్ దందాలో కీల‌క‌పాత్రధారి అంటూ ఆరోప‌ణ‌లున్నాయి. ఇక ఏకంగా స‌ర్కారు ప‌న్నుల‌కే ఎగ‌నామం పెట్టాల‌ని ప్ర‌య‌త్నించ‌డం న్యాయ‌స్థానంలో కూడా వివాదాస్ప‌దంగా మారుతోంది. ఎన్నిక‌ల వేళ ఎమ్మెల్యేకి ఇది త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించే అవ‌కాశం ఉంది.






Related News

వైసీపీకి షాకిచ్చి, జ‌న‌సేన‌లోకి..!

Spread the loveఏపీలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. వారు వీర‌వుతార‌న్న‌ట్టుగా ప‌రిస్థితులు మారుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా ఈ వ్య‌వ‌హారాల‌ను తానుRead More

రామోజీపై క్రిమిన‌ల్ ప్రోసిడింగ్స్ కి సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్

Spread the loveఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు కి చెందిన మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. గ‌తంలో వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *