ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం

modugula
Spread the love

టీడీపీ నేత‌లు ఎదురుతిరుగుతున్నారు. ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొన్న మండ‌లిలో అద్దంకి నేత క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌శ్న‌ల‌కు పాల‌క‌ప‌క్ష నేత‌లు అవాక్క‌య్యారు. ప్ర‌కాశం జిల్లాను నిర్ల‌క్ష్యం చేస్తున్నారంటూ ఆయ‌న సూటిగానే విమ‌ర్శించారు. దాంతో పాటు దొన‌కొండ‌లో ప‌రిశ్ర‌మ‌లు ఎందుకు పెట్ట‌డం లేదంటూ నిల‌దీయ‌డంతో అంతా ఖంగుతిన్నారు. దాని నుంచి తేరుకోక‌ముందే తాజాగా మ‌రో ఎమ్మెల్యే గొంతు విప్పారు. రైతు స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కు పాల‌క‌ప‌క్షం నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. స‌మాధానం లేక స‌త‌మ‌తం కావాల్సి వ‌చ్చింది.

రాష్ట్రంలో 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని చెప్పారని, అది ఎలా సాధ్యపడుతుంది, దానికేమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా, అలాంటిదేమీ లేకుండా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అసెంబ్లీలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఒకవైపు పండించిన పంటలను నిల్వ ఉంచుకునేందుకు గోడౌన్లు లేకపోతే ఇక రైతుకు ఎక్కడ నుంచి రెట్టింపు ఆదాయమొస్తుందో అర్థం కావడట్లేదంటూ వ్య‌గ్యంగా చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి.

వాస్త‌వానికి క‌ర‌ణం బ‌లరాంతో పాటుగా మోదుగుల కూడా కొంత‌కాలంగా టీడీపీలో త‌మ‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌నే అబిప్రాయంతో ఉన్నారు. అద్దంకిలో గొట్టిపాటి మూలంగా క‌ర‌ణం తీవ్రంగా స‌త‌మతం అవుతున్నారు. ఆ ఆగ్ర‌హంతోనే మండ‌లిలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీశార‌ని చాలామంది భావిస్తున్నారు. అందుకుతోడుగా మోదుగుల కూడా పార్టీ మారే యోచ‌న‌లో ఉన్నార‌ని చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే అసెంబ్లీలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌డం విశేషంగా భావింవ‌చ్చు. అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌తిప‌క్షం బాయ్ కాట్ చేయ‌గా, ఇలాంటి నేత‌లంతా ఆపాత్ర‌ను పోషిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.


Related News

akula satyanarayaa

బీజేపీకి ఎమ్మెల్యే గుడ్ బై!

Spread the love8Sharesఏపీలో అస‌లే బీజేపీ ప‌రిస్థితి బాగోలేదు. ఆపార్టీకి అన్నీ ఆటంకాలే అన్న‌ట్టుగా మారింది. హోదా ఉద్య‌మం దావానంలోRead More

BJP-AP

గోదారోళ్ల‌కే ప‌ట్టం క‌డుతున్న పార్టీ

Spread the love4Sharesక‌మ‌లానికి కొత్త సార‌ధి ఖాయం అయ్యింది. త్వ‌ర‌లోనే నాయ‌కుడెవ‌ర‌న్న‌ది తేల‌బోతోంది. ప‌లువురు ఆశావాహులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.Read More

 • టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌
 • బెజ‌వాడలో వైసీపీ కి కొత్త స‌మ‌స్య‌లా..?
 • అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం
 • బాబుకి షాక్…వైసీపీలోకి కీల‌క నేత‌
 • కాగ్ రిపోర్ట్ ని దాచేసిన ప్ర‌భుత్వం!
 • ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం
 • వైసీపీ రాజీనామాలు: బైఠాయించిన టీడీపీ
 • అయ్యో..నారా లోకేష్!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *