Main Menu

గుంటూరు టీడీపీకి పెద్ద షాక్

Spread the love

గుంటూరు జిల్లాలో టీడీపీకి డబుల్ షాక్ త‌ప్పేలా లేదు. టీడీపీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించిన‌ లాల్‌జాన్ బాషా కుటుంబం ఆపార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యింది. అంతేగాకుండా సీనియర్ నేత షౌకత్‌ పార్టీని వీడే యోచనలో ఉండ‌డంతో తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. టీడీపీ అభ్య‌ర్థిత్వం కోసం ఎదురుచూసిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మాత్రం న‌సీర్ కి ఛాన్సివ్వ‌డంతో ఈ నేత‌లంతా జంపింగ్ కి రెడీ అయిన‌ట్టు చెబుతున్నారు.

సీర్‌‌ను ప్రకటించడంపై లాల్‌జాన్ కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అనుచరులతో లాల్‌జాన్‌ బాషా కుటుంబం సమావేశమైంది. వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి సీటు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమను ఒక్క మాట కూడా అడగకుండా చంద్రబాబు తూర్పు అభ్యర్థిని ప్రకటించారని లాల్‌జాన్ కుటుంబం మనస్తాపానికి గురైంది. ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న ఎంపీ గల్లా లాల్‌జాన్‌ కుమారుడి ఆఫీస్‌కు వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన లాల్ వర్గీయులు గల్లాను అడ్డుకున్నారు.

టీడీపీని వీడేందుకు సీనియర్‌ నేత షౌకత్ సన్నాహాలు చేస్తున్నారు. గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థిగా నజీర్‌ను ప్రకటించడంపై మనస్తాపం చెందారు. దీంతో టీడీపీకీ వీడేందుకు అనుచరులతో ఆయన సమావేశమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ గల్లా కుటుంబం తీరుపై షౌకత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి చూస్తే.. ఈ ఇద్దరు టీడీపీని వీడితే నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ స్థానంపై కూడా వీరి ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. దాంతో వారిని వైసీపీలో చేరకుండా చూడాల‌ని టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. బుజ్జ‌గింపుల కోసం రంగంలో దిగారు.






Related News

రీపోలింగ్ త‌ప్ప‌లేదు..

Spread the loveఏపీ ఎన్నిక‌ల్లో రీపోలింగ్ త‌ప్ప‌లేదు. రాష్ట్రంలోని మూడు జిల్లాల ప‌రిధిలో రీపోలింగ్ కి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.Read More

వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టిగా పోరాడినా చివ‌రిలో చ‌తికిల‌ప‌డింది. ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని ఆశిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *