Main Menu

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the love

ఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది. ఆపార్టీ తీవ్రంగా మ‌ధ‌న‌ప‌డుతున్న‌ట్టుగానే చేనేత కార్మిక కుటుంబానికి చెందిన కీల‌క నేత చేజారిపోయారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు క‌మ‌ల నేరుగా జ‌గ‌న్ ని క‌లిసి కండువా క‌ప్పుకున్నారు.

మంగ‌ళ‌గిరిలో చేనేత కుటుంబాల‌కు చెందిన ఓట్లు అత్యంత కీల‌కం. గ‌తంలో టీడీపీ అదే వ‌ర్గానికి ఈ టికెట్ కేటాయించింది. కానీ ప్ర‌స్తుతం నారా లోకేశ్ ని రంగంలో దింపారు. అయితే ఆయ‌న‌కు చేనేత కార్మికుల నుంచి మ‌ద్ధ‌తు ల‌భిస్తేనే గ‌ట్టెక్క‌గ‌లిగే అవ‌కాశం ఉంది. అలాంటి స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు క‌మ‌ల టీడీపీకి షాకివ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈకాండ్రు కమల కాంగ్రెస్ తరఫున 2009లో ఎన్నికల్లో కాండ్రు కమల ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె…అనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీలో చేరారు. ప్రస్తుతం మంగళగిరి సీటు నారాలోకేశ్‌కు కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న కాండ్రు కమల వైసీపీలో చేరడం కీల‌కంగా మారింది.






Related News

రీపోలింగ్ త‌ప్ప‌లేదు..

Spread the loveఏపీ ఎన్నిక‌ల్లో రీపోలింగ్ త‌ప్ప‌లేదు. రాష్ట్రంలోని మూడు జిల్లాల ప‌రిధిలో రీపోలింగ్ కి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.Read More

వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టిగా పోరాడినా చివ‌రిలో చ‌తికిల‌ప‌డింది. ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని ఆశిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *