Main Menu

అధికార పార్టీ పెద్ద‌ల రేవ్ పార్టీ క‌ల‌క‌లం

Spread the love

ఎవ‌రైనా అశ్లీల డ్యాన్సుల చేస్తూ వెంట‌నే అరెస్ట్ చేసి, మీడియా ముందు ప్ర‌వేశ‌పెడ‌తారు పోలీసులు. కానీ ముజ్రా, రేవ్‌ పార్టీలలో మునిగితేలుతున్న వారిని మాత్రం దానికి భిన్నంగా ట్రీట్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విజ‌య‌వాడ‌లో ముజ్రా పార్టీ క‌ల‌క‌లం అంద‌రికీ తెలిసిందే. తాజాగా విజ‌య‌వాడ‌లో ఆటంకాలు ఏర్ప‌డుతుండ‌డంతో కొంద‌రు టీడీపీ పెద్ద‌లు తూర్పు ఏజ‌న్సీని ఎంచుకున్నారు. రేవ్ పార్టీలు సాగిస్తున్నారు.

తీరా విష‌యం బ‌య‌ట‌కు బ‌య‌ట‌కు పొక్క‌డంతో క‌ల‌క‌లం రేపింది. పోలీసులు రంగంలో దిగారు. అరెస్టులు చేశారు. అంతే అంత‌లోనే కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింది. వెంట‌నే తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన మంత్రి రంగంలో దిగారు. అరెస్టు అయిన వారిని ఆఘ‌మేఘాల మీద కోర్టుకి కూడా త‌ర‌లించ‌కుండా స్టేష‌న్ బెయిల్ తోనే నామ‌మాత్ర‌పు కేసుల‌తో ఇంటికి పంపించేశారు.

దాంతో రంపచోడవరం రేవ్‌పార్టీలో నగరానికి చెందిన కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు పట్టుబడ్డడంతోనే ఇలాంటి వ్య‌వ‌హారం సాగిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. గతంలో విజతోయవాడలో నిర్వహించిన ముజ్రా పార్టీలోనూ పలువురు కార్పొరేటర్లు ఉన్న ఘటన మర్చిపోకముందే తాజాగా మరో రేవ్‌ పార్టీలో కార్పొరేటర్లు దొరకడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. తూర్పు నియోజవర్గంలో కీలకమైన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ ఈ రేవ్ పార్టీకి మూల‌ప‌రుషుడుగా చెబుతున్నారు. ఏమ‌యినా టీడీపీ పెద్ద‌లు ప‌ట్టుబ‌డ్డార‌ని తెలియ‌గానే అమాత్యులు రంగంలో దిగి కేసు నీరుగార్చేసిన వైనం వివాదాస్ప‌దం అవుతోంది.






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *