Main Menu

చీర ఎత్తుకెళ్లింది టీడీపీ నేత‌..!

Spread the love

బెజ‌వాడ అమ్మ‌వారి ఆల‌యంలో చీర ఎత్తుకెళ్లిన సంగ‌తి దుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన పెద్ద‌లే ఈ వ్య‌వ‌హార‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. రాజ‌కీయంగానూ దుమారం రేపుతోంది. క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ఆల‌యంలో చీర దొంగ‌త‌నం కేసులో ఇప్పుడు అంద‌రి వేళ్లూ పాల‌క‌మండ‌లి స‌భ్యురాలు సూర్య‌ల‌త‌కుమారి వైపు క‌నిపిస్తున్నాయి. చివ‌ర‌కు ఈవో కూడా ఆమెను దోషిగా చూపుతూ ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే అర్చ‌కులు కూడా బ‌హిరంగంగానే మీడియా స‌మావేశంలో ఆమె మీద విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేగాకుండా వాంగ్మూలంలో కూడా చీర తీసుకెళ్లిన విష‌యం మీద ఆమె అభిప్రాయం స్వీక‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌ర‌కు పోలీసులు కూడా కేసు న‌మోదు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

విజ‌య‌వాడ‌కు చెందిన ఓ కీల‌క‌నేతతో స‌న్నిహితంగా మెలిగే మ‌హిళా నాయ‌కురాలిగా ఆమెకు పేరుంది. స‌దరు నాయ‌కుడి సిఫార్సుతోనే సూర్య‌ల‌త‌కి ఆల‌యం పాల‌క‌వ‌ర్గంలో అవ‌కావం ద‌క్కిన‌ట్టు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె అనూహ్యంగా ఆఖ‌రికి అమ్మ‌వారి చీర‌లు కూడా వ‌దిలిపెట్ట‌కుండా దొంగిలించేందుకు ప్ర‌య‌త్నించ‌డం వివాదం అవుతోంది. ఈ విష‌యంలో తెలుగుదేశం పార్టీ నేత‌ల తీరు మీద ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చీర‌ను సైతం వ‌దిలిపెట్ట‌కుండా అప‌హ‌రించిన నేప‌థ్యంలో విజ‌య‌వాడ అమ్మ‌వారి ఆల‌యంలో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

గ‌తంలో క్షుద్ర‌పూజ‌లు నేప‌థ్యంలో తాజాగా చీర‌ను అప‌హ‌రించే ప‌ని ఆశ్చ‌ర్య‌క‌రంగా క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వ‌స్తుండ‌డంతో చివ‌ర‌కు పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ కూడా స్పందించారు. చీర మాయం ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టు ప్ర‌క‌టించారు. విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కూ సూర్య‌ల‌త‌ను పాల‌క‌మండ‌లి స‌భ్యురాలి ప‌ద‌వి నుంచి ప‌క్క‌న పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *