Main Menu

రాజమండ్రి నుంచి కాకినాడ మారిపోయిన టీడీపీ

Spread the love

టీడీపీ మారిపోయింది. కాకినాడ‌కు త‌ర‌లించేస్తోంది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అనుకున్న‌ప్ప‌టికీ అక్క‌డి ప‌రిస్థితులు అనుకూలంగా లేవ‌ని భావిస్తోంది. కాకినాడ‌లో స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని ఆశిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఈనెల 29న నిర్వ‌హించాల్సిన ధ‌ర్మ‌పోరాట స‌భ‌ను కాకినాడ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. తొలుత రాజ‌మ‌హేంద్ర‌వరంలో సెంటిమెంట్ రీత్యా కూడా క‌లిసి వ‌స్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ సిటీ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ లో ముఠా పోరుతో మ‌న‌సు మార్చుకుంది. వ‌ర్గ‌పోరు కార‌ణంగా జ‌న‌స‌మీక‌ర‌ణలో విఫ‌ల‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ఊహించి జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని గోరంట్ల త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఆయ‌న‌కు పోటీగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పావులు క‌దుపుతున్నారు. సినీయారిటీ కోటాల‌కే ఛాన్స్ త‌న‌కు ద‌క్కాల‌ని గ‌న్ని కృష్ణ ప‌ట్టుబడుతున్నారు. దాంతో మూడు క్యాంపులుగా టీడీపీ మారిపోయింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డి పరిస్థితిని చ‌క్క‌దిద్ద‌కుండా, స‌భ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌ప‌డితే చిక్కులు త‌ప్ప‌వ‌ని టీడీపీ అధిష్టానం భావించింది. దాంతో ధ‌ర్మ‌పోరాట స‌భ‌ను కాకినాడ‌కు త‌ర‌లించేసింది. జేఎన్టీయూ గ్రౌండ్ లో స‌భ ఏర్పాటు కోసం స‌న్నాహాలు చేస్తున్నారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించిన స‌భ నేప‌థ్యంలో టీడీపీ జ‌న‌సమీక‌ర‌ణ‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగ‌బోతోంది.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the love13Sharesవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *