Main Menu

టీడీపీ చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయం!

Spread the love

తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లో మ‌రో ఆధ్యాయం మొద‌ల‌వుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా చంద్ర‌బాబు కీల‌క అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ ఏదో పార్టీతో క‌లిసి సాగుతున్న టీడీపీ ఈసారి కాంగ్రెస్ తో క‌ల‌యిక‌కి సిద్ధ‌మ‌య్యింది. అందుకు రేపే బీజం ప‌డుతోంది. టీడీపీ, కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు పొడిచింది. రేపు దానికి తొలి అంకం పూర్త‌వుతోంది.

తెలంగాణా అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అందుకు టీడీపీ అద్య‌క్షుడు చంద్ర‌బాబు, టీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. హైద‌రాబాద్ లో ఇరు పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు సాగ‌బోతున్నాయి. టీడీపీకి 15 సీట్లు కావాల‌ని అడుగుతున్న‌ట్టు స‌మాచారం. అయితే అందులో మెజార్టీ స్థానాలు ఖ‌మ్మం, న‌ల్గొండ‌, హైద‌రాబాద్ లో ఉన్నాయి. న‌ల్గొండ విష‌యంలో కాంగ్రెస్ కి కొంత స‌మ‌స్య‌లు త‌ప్పేలా లేదు. దానిని ఇరుపార్టీలు ఎలా అంగీక‌రిస్తాయ‌న్న‌ది సందేహంగా క‌నిపిస్తోంది. టీడీపీకి కేవ‌లం 8 నుంచి 10 సీట్లు అంగీక‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో టీజేఎస్, సీపీఐ , కొత్త‌గా ఏర్ప‌డిన యువ పార్టీకి కూడా కాంగ్రెస్ సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మ‌హాకూట‌మి దిశ‌గా ప‌రిణామాలు మారుతున్న త‌రుణంలో తొలి అడుగులు ప‌డుతున్నాయి. కాంగ్రెస్ వ్య‌తిరేక‌త‌తో పుట్టిన పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్ తో చేతులు క‌ల‌ప‌డం మారుతున్న రాజ‌కీయాల‌కు సంకేతంగా చెప్ప‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని సాగిన టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా త‌న చిర‌కాల శ‌త్రువుతో స‌ఖ్య‌త చేయ‌డానికి సైతం అంగీక‌రించ‌డం విశేషం అవుతోంది.

కాంగ్రెస్ తో పొత్తుని ఏపీలోని కొంద‌రు మంత్రులు వ్య‌తిరేకించారు. అయినా చంద్ర‌బాబు ముందుకెళుతున్నారు. కానీ వారు మాత్రం నోరు తెర‌క‌పోవ‌డం గ‌మ‌నిస్తే చంద్ర‌బాబు వ్యూహంలో భాగంగానే మంత్రులు భిన్న‌స్వ‌రాలు వినిపించిన‌ట్టు క‌నిపిస్తోంది.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the loveవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *