Main Menu

చంద్ర‌బాబు వెన‌క‌డుగు..

Spread the love

ఎన్నిక‌ల షెడ్యూల్ కి నెల రోజుల ముందుగానే తన నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు వెల్ల‌డించిన సీఎం చంద్ర‌బాబు వెన‌క‌డుగు వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్ర‌వ‌రిలో నెలాఖ‌రులో రాబోతోంది. ఈలోగా జ‌న‌వ‌రి మ‌ధ్య‌లోనే టీడీపీ అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు ముహూర్తం మార్చేశారు. ఫిబ్ర‌వ‌రిలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు తేల్చేశారు. అంటే దాదాపుగా ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చిన త‌ర్వాతే టీడీపీ లిస్ట్ వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ తర్వాత అభ్యర్థుల పేర్ల ప్రకటన ఉంటుందని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఏపీ సీఎం 20న రాత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. 25న ఆయన తిరిగి వస్తారు. ఆ మర్నాడు రిపబ్లిక్‌ దినోత్సవం. 27న రాజమండ్రిలో జయహో బీసీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఏతావాతా ఫిబ్రవరిలోనే తొలి జాబితా విడుదలయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఫిబ్రవరిలో అమరావతిలో భారీ బహిరంగ సభకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆ పార్టీ వివిధ జిల్లాల్లో ధర్మ పోరాట సభలు నిర్వహించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలే మిగిలిపోయాయి. ఈ రెండు జిల్లాలకు కలిపి అమరావతిలో సభ జరపాలని నిర్ణయించారు.

ఈ సభకు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించాలని సీఎం భావిస్తున్నారు. వివిధ పార్టీల నేతలతో మాట్లాడి వారి సమయాన్ని బట్టి సభకు తేదీని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ సభ తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈలోపు చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తు పూర్తి చేసుకొంటున్నారు. నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికలు తెప్పించుకోవడం, ఐవీఆర్‌ఎస్‌ విధానం ద్వారా అభిప్రాయ సేకరణ, గత ఎన్నికలతో వివిధ అంశాలను పోల్చి చూడటం వంటివి జరుగుతున్నాయి. అన్ని క‌స‌ర‌త్తుల త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో జాబితా వెలువ‌డే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *