జ‌న‌సేన‌లో అనూహ్య ప‌రిణామం

pawankalyandileep1-1522153704
Spread the love

నిన్న‌టి వ‌ర‌కూ జ‌న‌సేన‌కు హార్డ్ కోర్ గా భావించిన సుంక‌ర క‌ళ్యాణ్ దిలీప్ హఠాత్తుగా మ‌న‌సు మార్చుకున్న‌ట్టు క‌నిపించింది. త‌న‌ను అవ‌మానించారంటూ జ‌న‌సేన మీద తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అలాంటిది ఇప్పుడు మ‌ళ్లీ అనూహ్యంగా మాట మార్చేశారు. ఏకంగా పార్టీ అధినేత ద‌ర్శ‌నం దొర‌క‌డంతో దిలీప్ చ‌ల్ల‌బ‌డ్డారు. త‌న అభిమాన నేత‌ను క‌లిసిన ఆనందంలో త‌న‌లో చాలా మార్పు ఖాయం అంటున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ త‌ర్వాత దిలీప్ జై జ‌న‌సేన‌, జై ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ నిన‌దించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీ త‌ర్వాత ‘‘అధినేతను కలవడం అద్భుతంగా త‌న‌కు అనూభ‌తి క‌లుగుతోంద‌న్నారు. 41 రోజుల మెడిటేషన్ చేయాల‌ని సూచించారు. అధినేత సూచనల మేరకు ఈ మండలం(41) రోజులు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటానంటూ త‌న ఫేస్ బుక్ అకౌంట్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ భేటీలో ‘‘వ్యవస్థతో పోరాడే శక్తి కలవాడివి.. నీ స్థాయి ఏంటో తెలియని వ్యక్తులతో ఎంతకాలం పోరాడుతావ్..? సోషల్ మీడియా విమర్శలకు స్పందించడం మానెయ్యగలిగే నియంత్రణ సాధించు. నన్ను ఎంతో మంది ఎన్నో అంటారు.. వాటిన్నటికీ స్పందిస్తే.. గమ్యం చేరుకోగలా..?’’ అని పార్టీ కార్యాలయంలో ఇద్దరు ప్రముఖుల సమక్షంలో అధినేత(పవన్) ఈ వ్యాఖ్యలు చేశారని ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.దాంతో క‌ళ్యాణ్ దిలీప్ మ‌ళ్లీ జ‌న‌సేన‌లో కొన‌సాగుతున్న విష‌యం స్ప‌ష్టం అయ్యింది. ఇలా ప‌దే ప‌దే మ‌న‌సు మార్చుకుంటున్న దిలీప్ తీరు రాజ‌కీయ వ‌ర్గాల్లో కొంత ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది.


Related News

akula satyanarayaa

బీజేపీకి ఎమ్మెల్యే గుడ్ బై!

Spread the love8Sharesఏపీలో అస‌లే బీజేపీ ప‌రిస్థితి బాగోలేదు. ఆపార్టీకి అన్నీ ఆటంకాలే అన్న‌ట్టుగా మారింది. హోదా ఉద్య‌మం దావానంలోRead More

BJP-AP

గోదారోళ్ల‌కే ప‌ట్టం క‌డుతున్న పార్టీ

Spread the love4Sharesక‌మ‌లానికి కొత్త సార‌ధి ఖాయం అయ్యింది. త్వ‌ర‌లోనే నాయ‌కుడెవ‌ర‌న్న‌ది తేల‌బోతోంది. ప‌లువురు ఆశావాహులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.Read More

 • టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌
 • బెజ‌వాడలో వైసీపీ కి కొత్త స‌మ‌స్య‌లా..?
 • అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం
 • బాబుకి షాక్…వైసీపీలోకి కీల‌క నేత‌
 • కాగ్ రిపోర్ట్ ని దాచేసిన ప్ర‌భుత్వం!
 • ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం
 • వైసీపీ రాజీనామాలు: బైఠాయించిన టీడీపీ
 • అయ్యో..నారా లోకేష్!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *