Main Menu

కాగ్ రిపోర్ట్ ని దాచేసిన ప్ర‌భుత్వం!

Spread the love

ఆశ్చ‌ర్యంగా ఉన్నా..ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఓవైపు ప‌ట్టిసీమ చుట్టూ పెద్ద రాద్ధాంతం జ‌రుగుతోంది. త్వ‌ర‌లో ఏకంగా సీబీఐ విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారీ అవినీతి జ‌రిగింద‌ని బీజేపీ నేత‌లు అసెంబ్లీలోనూ, బ‌య‌ట ప్ర‌స్తావించ‌డం వెనుక అస‌లు కార‌ణం ప‌ట్టిసీమ పై విచార‌ణ‌కు సిద్ధం కావ‌డ‌మేన‌ని సందేహిస్తున్నారు. అలాంటి స‌మ‌యంలో నీటిపారుద‌ల రంగానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్ ని బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌డం విశేషంగా మారింది.

వాస్త‌వానికి కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట్ జ‌న‌ర‌ల్ ప్ర‌తీ ఏటా ఇచ్చే నివేదిక‌ను స‌భ ముందుంచ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌. అయితే ఇటీవ‌ల దానిని బ‌డ్జెట్ స‌మావేశాల చివ‌రి రోజుకి ప‌రిమితం చేసేస్తున్నారు. త‌ద్వారా స‌భ‌లో విప‌క్షాలు నిల‌దీసే అవ‌కాశం లేకుండా పోతుంద‌ని ప్ర‌భుత్వాల ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఇక తాజాగా ఏపీ ప్ర‌భుత్వం అయితే మ‌రో అడుగు ముందుకేసిన‌ట్టు విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కాగ్ నివేదిక‌ను పూర్తిగా బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌ని ఆరోపిస్తున్నాయి. ఏకంగా పీఏసీ చైర్మ‌న్ బుగ్గ‌న రాజేంద్ర‌నాద్ రెడ్డి అభిప్రాయం ప్ర‌కారం కీల‌క‌మైన నాలుగో భాగాన్ని లేకుండా చేసి కాగ్ నివేదిక విడుద‌ల చేశార‌ని ఆరోపించారు.

కాగ్‌ ఆడిట్‌ మూడు రకాలుగా ఉంటుందని వివరించిన ఆయన ఎకనామిక్‌ సెక్టార్‌లో వ్యవసాయం, నీటి పారుదల, రోడ్లు, భవనాలు, అటవీ, పరిశ్రమ, విద్యుత్‌ శాఖలుంటాయన్నారు. వీటిని రిపోర్టు నెంబర్‌ 4గా పేర్కొనటం జరుగుతుందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అన్ని రిపోర్టుల్నీ టేబుల్‌ చేసి, నాలుగో రిపోర్టును మాత్రం టేబుల్‌ చేయలేదని చెప్పారు. నీటి పారుదల శాఖలో ఏమైనా అవకతవకలున్నాయా..? అందుకే అసెంబ్లీలో టేబుల్‌ చేయలేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం…రాష్ట్ర స్థూల ఉత్పత్తి కంటే 3 శాతం మించి అప్పు చేయడానికి వీల్లేదని, కానీ చంద్రబాబు 2014-15 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ. 31,700 కోట్లున్నా 6.1 శాతం అప్పు చేశారన్నారు. 2015-16లో ద్రవ్యలోటు రూ. 22 వేల కోట్లుంటే 3.66 శాతం అప్పు చేశారని, 2016-17 రూ.31 వేల కోట్లుంటే 4.42 శాతం అప్పు చేశారని వివరించారు. చంద్రబాబు అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం నుంచి అప్పులు చేస్తూనే ఉన్నారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అప్పులెందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేద‌ని ఆయ‌న వివ‌రించారు. అదే స‌మ‌యంలో కాగ్ రిపోర్ట్ లోని నాలుగో భాగాన్ని త‌క్ష‌ణం బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. దాంతో కాగ్ రిపోర్ట్ కూడా ర‌హ‌స్యంగా మార్చేసే ప‌రిస్థితి రావ‌డం విడ్డూరంగా, విశేషంగా ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.


Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *