జ‌గ‌న్ కి, బాబుకి తేడా లేన‌ట్టేనా?

jagan
Spread the love

సందేహం తీరిపోయింది. జ‌గ‌న్ హూందాత‌నం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఫిరాయింపుల విష‌యంలో గ‌తంలో తాను చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిని రాజీనామా చేయాల‌ని ఆదేశించ‌డం ఆశావాహంగా క‌నిపిస్తోంది. ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ జంప్ అయ్యేముందు విలువ‌ల‌కు కొంతైనా క‌ట్టుబ‌డి ఉండేలా జ‌గ‌న్ నిర్ణ‌యం దోహ‌దప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇటీవ‌ల పార్టీ ఫిరాయింపుల‌కు సంబంధించిన పెద్ద చ‌ర్చ సాగింది. వైసీపీ త‌రుపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. చివ‌ర‌కు కోర్టులో కూడా జోక్యం చేసుకున్నాయి. న‌లుగురు ఫిరాయింపు మంత్రుల‌కు నోటీసులు కూడా అందాయి. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ నేత‌లు త‌మ పార్టీలో గెలిచిన వారంద‌రినీ రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలంటూ అనేక మార్లు డిమాండ్ చేశారు. జ‌గ‌న్ కూడా ప‌దే ప‌దే ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. కానీ ఇప్పుడు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డికి ఆయ‌న వైసీపీ కండువా క‌ప్ప‌డానికి సిద్ధం కావ‌డం మ‌రోసారి ఫిరాయింపుల వ్య‌వ‌హారం ముందుకొచ్చింది.

శిల్పా చ‌క్ర‌పాణి గ‌డిచిన ఏప్రిల్ లో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ కోటాలో క‌ర్నూలు నుంచి విజ‌యం సాధించారు. వైసీపీ అభ్య‌ర్థి గౌరు వెంక‌ట‌రెడ్డిపై ఆయ‌న గెలిచారు. అప్ప‌ట్లో శిల్పా వైసీపీ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నారు. టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని భారీగా ఖ‌ర్చు చేసి త‌న అభ్య‌ర్థి గెలిపించుకుంది. కానీ తీరా ఇప్పుడు నాలుగు నెల‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే శిల్పా పార్టీ ఫిరాయించ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. కానీ అదే స‌మ‌యంలో టీడీపీ ఫిరాయింపుల మీద పెద్ద‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసిన జ‌గ‌న్ ఇప్పుడు శిల్పాను ఏర‌కంగా పార్టీలో చేర్చుకుంటార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఆచితూచి అడుగులేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

టీడీపీ ఎమ్మెల్సీ త‌న పార్టీలో చేరేముందు ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆదేశించ‌డంతో శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌విని వ‌దులుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఇప్పుడు జ‌గ‌న్ నిర్ణ‌యం త‌ర్వాత మ‌రో ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది. క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ప‌ద‌వి ఖాళీ కాబోతోంది. మొత్తంగా ఫిరాయింపుల విష‌యంలో జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హరించ‌డం ఆశావాహంగా క‌నిపిస్తోంది.


Related News

shivaji

శివాజీ కామెంట్స్ చుట్టూ ర‌చ్చ‌

Spread the loveఅప‌రేష‌న్ గ‌రుడ‌..ఆప‌రేష‌న్ ద్రావిడ‌..రెండు రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశాలుగా మారాయి. దానికి కార‌ణం సినీ న‌టుడు శివాజీRead More

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the loveఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

 • త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్
 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *