రెచ్చిపోయిన రోజా

ROJA
Spread the love

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి రెచ్చిపోయారు. అటు సీఎం చంద్రబాబుని, ఇటు ఎమ్మెల్యే బాలయ్యని కూడా వదిలిపెట్టలేదు. ఇద్దరు నేతల మీద ఘాటు వ్యాఖ్యలతో హీటు పెంచారు. అధికార పార్టీ తీరు మీద రోజా విరుచుకుపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రోజా.. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరువుకు ప్యాంట్, షర్ట్ వేస్తే.. అది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఇష్టారీతిన దోచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి ఇప్పటి వరకు 600 హామీలిచ్చిన చంద్రబాబు.. ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. బాలమృతం పథకాన్ని కూడా అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రలో నెలకొందన్నారు. దీనికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఈ రోడ్లపై నడవవద్దని టీడీపీ నేతలు అంటున్నారు.. ఇవేమైనా ఖర్జూరపు నాయుడు సొమ్ముతో వేసినా రోడ్లా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, నంద్యాల ఎన్నికల్లో టీడీపీని ఓడించి వారికి తగిన బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇక బాలయ్య వ్యాఖ్యలకు కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన నిజాలు తెలుసుకుంటే మంచిదని హితువు పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి బాలయ్య వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.


Related News

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the loveఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

pawantt_4127

త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిప్రాయానికి,Read More

 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • చంద్ర‌బాబుని అవ‌మానిస్తున్న హ‌స్తిన‌!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *