Main Menu

మోడీ, బాబు మధ్యలో అంబానీ

Spread the love

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ మధ్య సంబంధాలు ఈనాటివి కాదు. సుదీర్ఘకాలంగా వారికి సాన్నిహిత్యం ఉంది. సహజంగా కార్పోరేట్లతో చెలిమి కోసం తహతహలాడే చంద్రబాబు దానికి తగ్గట్టుగానే అంబానీతో రాసిపూసుకుని తిరగడం ద్వారానే, కేజీ బేసీన్ గ్యాస్ నిక్షేపాలపై అంబానీలకు పెత్తనం దొరికిందని కూడా చెబుతారు.

అయితే తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో ముఖేష్ అంబానీ అనూహ్యంగా అమరావతికి రావడం అందరిలో ఆసక్తి రేపుతోంది. నిజానికి పెట్టుబడుల కోసమే అయితే అంబానీ ఇక్కడి వరకూ రారన్నది చాలామంది చెబుతున్న విషయం. ఆయన పెట్టుబడులు పెడతామంటే చంద్రబాబు, లోకేష్ వంటి వారు ఎక్కడికయినా వెళ్లి ఎంవోయూ రాసుకుని వస్తారని చెబుతున్నారు. అంతకుముందు ముఖేష్ బార్య కూడా రెండేళ్ల క్రితం అమరావతి వచ్చారు. అప్పట్లో నీతూ అంబానీకి చంద్రబాబు రాచమర్యాదలు చేశారు. ఆ తర్వాత అనిల్ అంబానీ కూడా వచ్చారు. భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు. ఎంవోయూ కూడా చేసుకున్నారు. కానీ విశాఖ అచ్యుతాపురం సమీపంలో పెట్టాలనుకున్న యూనిట్ ని అనిల్ అంబానీ విరమించుకున్నారు.

ఇక తాజాగా ముఖేష్ అంబానీ అమరావతి పర్యటన వెనుక పరిణామాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం మోడీ, చంద్రబాబు మధ్య వైరం ముదురుతోంది. ప్రఛ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. మరీ తనకున్న అధికారం రీత్యా చంద్రబాబుని అసలు ఖాతరు చేస్తున్న దాఖలాలే లేవు. ఏకంగా 16 నెలల పాటు దర్శనభాగ్యం కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పెంపుదల కోసం చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. తీవ్రంగా శ్రమించారు. అయినా మోడీ కనికరించలేదు. దాంతో ప్రత్యేక ప్యాకేజీ, బడ్జెట్ నిధుల పేరుతో చంద్రబాబు నిరసనలకు దిగారు. అది వారి మధ్య గ్యాప్ ని బాగా పెంచింది. ఈ నేపథ్యంలో మోడీ, బాబు మధ్య సఖ్యత కోసం అంబానీ వచ్చారనే వాదన వినిపిస్తోంది.

నిజానికి అంబానీ రాక సందర్భంగా పెద్దగా పెట్టుబడుల ప్రకటనలు ఏమీ లేవు. శ్రీసిటీలో చిన్న యూనిట్ గురించి ప్రకటించారు. వ్యవసాయంలో రిలయెన్స్ పెట్టుబడులంటూ చెప్పుకొచ్చారు. దానికి మించిన కారణం రాజకీయాలేనని చెబుతున్నారు. మారుతున్న రాజకీయాల్లో కార్పోరేట్లు నేరుగా సీన్ లోకి వచ్చి చర్చలు జరిపే పరిస్థితి వచ్చేసిందనడానికి ఇదో ఉదాహరణగా చెబుతున్నారు. గతంలో బీహార్ లో నితీష్ కుమార్ ని బీజేపీ గూటికి చేర్చడంలోనూ రిలయెన్స్ అధినేత పాత్ర ఉంది. ఇప్పుడు చంద్రబాబు కూడా బీజేపీని బద్నాం చేసే యత్నాలను విరమించుకోవడానికి తగ్గట్టుగా ఓ ప్రయత్నం సాగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు టీటీడీ నూతన పాలకవర్గం నియామకం నేపథ్యంలో రిలయెన్స్ ప్రాతినిధ్యం గురించి కూడా చర్చ జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఏమయినా అంబానీ పర్యటన నిజంగా రాజకీయం కోసమా..కాదా అన్నది త్వరలో టీడీపీ తీసుకోబోయే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ప్రత్యర్థి జగన్ కాలుదువ్వుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఒక్క అడుగు వెనక్కి వేసినా అది ప్రజలను మరింత దూరం చేసే ప్రమాదం ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుందో…


Related News

అమరావతిలో మళ్లీ లీకులు

Spread the love ఏపీ రాజధాని అమరావతిలో లీకుల పర్వం సాగుతోంది. గతంలో ప్రతిపక్ష నేత ఛాంబర్ లో లీకులొచ్చాయి.Read More

జోరు పెంచిన టీడీపీ!

Spread the loveటీడీపీ వ్యూహం మార్చింది. రాజ‌కీయంగా మ‌నుగ‌డ సాగించాలంటే మీడియాలో కొత్త పంథా అవ‌స‌రం అని గ్ర‌హించింది. దానికిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *