ఆత్మహత్యాయత్నం వెనుక రాయపాటి కొడుకు

rayapati
Spread the love

ఏపీలో మరో వివాదం రాజుకుంది. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు. గుంటూరు జిల్లాకి చెందిన ఈ సీనియర్ తెలుగుదేశం ఎంపీ కొడుకు కారణంగా డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం కలకలం రేపుతోంది. విజయ రాజు అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన దుమారం రేపుతోంది. అట్టడుగు వర్గానికి చెందిన తనను అన్నిరకాలుగానూ వేధించారని బాధితుడు వాపోతున్నారు.

నిద్ర మాత్రలు మింగిన విజయరాజును గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. టీడీపీ ఎంపీ కుమారుడు తనను వేధిస్తున్నట్లు సుసైడ్ నోట్‌లో బాధితుడు పేర్కొన్నాడు. ఎంపీ కుమారుడుతో మరో ముగ్గురు ఆఫీస్ సిబ్బంది పేర్లు లేఖలో ప్రస్తావించారు. తాను తీసుకున్న రూ. 15 వేలు అడ్వాన్స్ వెంటనే చెల్లించపోతే చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దాంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. గుంటూరు జిల్లాకిచెందిన ఎంపీ తనయుడి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని బాధితుని బంధువులు కోరతుున్నారు.






Related News

jaleelkhan

ఆ ఎమ్మెల్యేకి హ్యాండివ్వబోతున్న చంద్రబాబు

Spread the loveఏపీ రాజధాని రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులోనూ బెజవాడ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అందుకుRead More

MLA Alla Ramakrishna Reddy (2)

వైసీపీ ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు

Spread the loveఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రుష్ణారెడ్డికిRead More

  • కన్నా కమల దళపతి కావడానికి కారణం అదేనా?
  • జనసేనకు కన్నం కొట్టి..వైసీపీ కి?
  • ఆయన్ని మార్చేసిన జగన్
  • మళ్లీ నీరుగారిపోయిన జగన్ ఛాంబర్
  • టీడీపీ బలం మీద దెబ్బకొట్టిన జగన్
  • జనసేనకి లోకేష్ సవాల్
  • బాబుకి మరో దెబ్బ: టీడీపీ నుంచి జంపింగ్
  • వైసీపీ వైపు క‌న్నా క‌న్ను
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *