Main Menu

టీడీపీకి ట్రాన్స్ ట్రాయ్ దూరం…?

Spread the love

ఏపీలో కీల‌క ప‌రిణామాలు సాగుతున్నాయి. టికెట్ల త‌గాదా టీడీపీకి త‌ల‌నొప్పిని తెస్తోంది. తాజాగా సీనియ‌ర్ నేత , ట్రాన్స్ ట్రాయ్ అధినేత రాయ‌పాటి కూడా అల‌క పాన్పు ఎక్కారు. త‌న వారసుడి కోసం ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. గుంటూరు జిల్లాలో టిడిపిలో విభేదాలు, అసమ్మతి భగ్గుమంటోంది. తాజాగా నర్సరావుపేట ఎంపి స్థానాన్ని ప్రస్తుత ఎంపి రాయపాటి సాంబశివరావుకు కాకుండా మరొకరికి కేటాయిస్తున్నారని తెలిసి రాయపాటి అనుచరులు గుంటూరులో నిరసన తెలిపారు. పార్టీ మారాలని రాయపాటిని వత్తిడి చేశారు. ‘కాంగ్రెస్‌లో ఉండగా జిల్లాలో పది మందికి సీట్లు ఇచ్చిన మీకు ఇప్పుడు సీటు కోసం చంద్రబాబు చుట్టూ పదిసార్లు తిరగాల్సి వచ్చింద’ని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే రాయపాటి పార్టీ మారుతున్నారని మీడి యాలో వచ్చిన వార్తలతో టిడిపి అధిష్టానం అప్రమత్తమైంది. వెంటనే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, టిడిపి జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు రాయపాటి ఇంటికి వచ్చారు. తొందరపదొద్దని బుజ్జగించారు. మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలు రాయపాటికి ఫోన్‌ చేసి తగిన న్యాయం చేస్తామని సముదాయించారు. రాయపాటికి ఏదో రూపంలో న్యాయం జరుగుతుందని నర్స రావుపేట ఎంపి సీటు విషయంలో ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. కార్యకర్తలు ఆవేశపడొద్దని జివి ఆంజనేయులు, డొక్కామాణిక్య వరప్రసాద్‌ కోరారు. ఈ సంద ర్భంగా రాయపాటి మీడియాతో మాట్లాడుతూ తాను మూడు రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబును కలుస్తున్నా తగిన స్పందన లేదన్నారు. తనకు నర్సరావుపేట ఎంపి సీటు, తమ కుమారునికి సత్తెనపల్లి అసెంబ్లీ సీటు అడిగిన మాట వాస్తవమేనన్నారు.

అయితే ఎంపిగా మరికొంత మంది పేర్లు తెరపైకి వచ్చాయని, కొత్తవారి పేర్లు చంద్రబాబు ప్రస్తావించగా తనకంటే మంచి అభ్యర్థి ఉంటే అవకాశం ఇవ్వాలని కోరానని చెప్పారు. తనకు అవకాశం ఇవ్వకుంటే తన కుమారుడు రంగా రావుకు అవకాశం ఇవ్వాలని కోరగా చూద్దాం అన్నారని కానీ ఇప్పుడు సత్తెనపల్లి సీటు కోడెల శివప్రసాదరావుకు అవకాశం ఇవ్వడంతో తమ అనుచరులు కొంత ఆగ్రహంతో ఉన్నారని రాయపాటి పేర్కొన్నారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, పార్టీ కోసం పని చేస్తానని అన్నారు. అంతకు ముందు కొంత మంది కార్యకర్తలు స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు కావాలని రాయపాటి కుటుంబానికి టిక్కెట్‌ రాకుం డా అడ్డుకున్నారని విమర్శించారు. సత్తెనపల్లి, నర్సరావుపేటలో తీవ్ర అవినీతి ఆరో పణలతో కోడెల శివప్రసాదరావు ఇప్పటికే పార్టీని భ్రష్టు పట్టించారని, నర్సరావు పేట, సత్తెనపల్లిలో వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దుయ్యబట్టారు.






Related News

రీపోలింగ్ త‌ప్ప‌లేదు..

Spread the loveఏపీ ఎన్నిక‌ల్లో రీపోలింగ్ త‌ప్ప‌లేదు. రాష్ట్రంలోని మూడు జిల్లాల ప‌రిధిలో రీపోలింగ్ కి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.Read More

వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టిగా పోరాడినా చివ‌రిలో చ‌తికిల‌ప‌డింది. ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని ఆశిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *