అక్టోబర్ లో రాజకీయ సంక్షోభం

rayapati_0
Spread the love

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం కలకలం రేపుతుంటే మరోవైపు ఆయనకు తోడుగా రాయపాటి తయారయ్యారా అన్న సందేహం వస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల ఉద్దేశం ఎవరికీ అర్థం కాకపోయినా అక్టోబర్ లో రాజకీయ సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని రాయపాటి వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది.

ఇంద్రకీలాద్రిపై దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ లో రాజకీయ సంక్షోభం వచ్చే ప్రమాదం ఉన్నందును అది రాకూడదని తాను కోరుకున్నట్టు నర్సారావుపేట ఎంపీ చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారుతున్నాయి. అదే సమయంలో టీటీడీ చైర్మన్ వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆ దేవుడు తనకు ఇస్తే ప్రసాదంలో స్వీకరిస్తానని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కి సంబంధించిన పోలవరం కాంట్రాక్ట్ వ్యవహారం, టీటీడీ చైర్మన్ పదవులు విషయంలో ఆయన ఆశలు పండేలా కనిపించడం లేదని కథనాలు వస్తున్న నేపథ్యంలో రాయపాటి వ్యాఖ్యలు ఆసక్తిగొలుపుతున్నాయి.


Related News

ambani, cbn

మోడీ, బాబు మధ్యలో అంబానీ

Spread the loveఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ మధ్య సంబంధాలు ఈనాటివి కాదు. సుదీర్ఘకాలంగా వారికిRead More

rayapati

ఆత్మహత్యాయత్నం వెనుక రాయపాటి కొడుకు

Spread the loveఏపీలో మరో వివాదం రాజుకుంది. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు.Read More

 • చంద్రబాబుపై బీజేపీ నిప్పులు
 • జెండాపీకేసిన జనసేన
 • అమెరికాలోనూ టీడీపీదే అధికారం
 • మరో వైసీపీ వికెట్ డౌన్
 • బోండా ఉమా భార్యను ఇరికించారా?
 • మీరే తేల్చుకోండి…
 • బట్టబయలయిన టీడీపీ నేతల కిడ్నీ రాకెట్
 • అమరావతిలో అలజడి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *