చంద్రబాబుని చిక్కుల్లో నెట్టేందుకు మాజీ మంత్రి

ఏపీ క్యాబినెట్ మంత్రిగా మూడున్నరేళ్ల పాటు పనిచేసిన రావెల కిషోర్ బాబు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. తనకు అవమానం మిగిల్చి, అర్థాంతరంగా మంత్రి మండలి నుంచి తొలగించినందుకు తగిన రీతిలో కక్ష సాధించుకోవాలని ఆయన చూస్తున్నట్టు ప్రచారం సాగుోతంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబుని చిక్కుల్లో నెట్టేయత్నానికి ఆయన సన్నద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజకీయాలు ఆశ్చర్యంగానే ఉంటాయి. మంత్రిగా పనిచేసిన ఆయన తీరు దానికి ఉదాహరణ. ఇక వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్న రావెల, ఈసారి పార్లమెంట్ బరిలో దిగేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా జనసేన వైపు ఆయన మొగ్గు చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ తీర్థం పుచ్చుకుని తెలుగుదేశం పార్టీకి గండికొట్టే యోచనలో ఆయన ఉన్నారు.
అదే సమయంలో గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకి అండగా నిలిచిన మాదిగ సామాజికవర్గంలో చంద్రబాబు పట్ల పెరుగుతన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునే యోచనలో కనిపిస్తున్నారు. ఇప్పటికే మందక్రుష్ణకు రాజధానిలో నిరసన తెలపకుండా ప్రభుత్వం అడ్డుకున్న సమయంలో కూడా రావెల తోడుగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం స్వయంగా రావెల రంగంలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర మంతా పర్యటించి పెద్ద మాదిగగా ఉంటానని చెప్పిన చంద్రబాబు తమను మోసం చేశారంటూ మాదిగ వర్గంలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగా ఓ యాత్ర షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు.
ఇది తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లోకి నెట్టే ప్రమాదం ఉంది. ఎన్నికల ముందు తమకు అనుకూలంగా పనిచేసిన వర్గాన్ని దూరం చేయడానికి రావెల్ ప్రయత్నిస్తే టీడీపీకి నష్టం తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎస్సీలలో చంద్రబాబుకి చాలాకాలంగా మాదిగ సామాజికవర్గం తోడుగా ఉంది. ఇప్పుడు వారు కూడా దూరమయితే పాలకపక్షానికి పెద్ద నష్టమే వస్తుందని అంటున్నారు. దాంతో జనసేనలో చేరబోతున్న రావెల, ఇంకెలాంటి నిర్ణయాలతో ముందుకు సాగుతారో చూడాలి.
Related News

ఎన్టీఆర్ సినిమా అడ్డుకోండి చంద్రబాబు పిలుపు
Spread the loveఏపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవాలన్నారు. టీడీపీ శ్రేణులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లోRead More

అంబటికి జగన్ ఝలక్!
Spread the loveవైసీపీ లో గట్టిగా పార్టీ వాణీ వినిపించే నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. ఆది నుంచి జగన్Read More