Main Menu

ప‌వ‌న్ మౌన‌మే పొత్తుల‌కు సంకేత‌మా?

Spread the love

జ‌న‌సేన‌, టీడీపీ సంబంధాలు మ‌ళ్లీ తెర‌మీద‌కు రావడం హాట్ టాపిక్ అవుతోంది. జ‌న‌వరి 1 నాడు సీఎం చేసిన కామెంట్స్ తో మొద‌ల‌యిన చ‌ర్చ‌, జ‌న్మ‌భూమి స‌భ‌లో రెండో సారి చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న‌తో మ‌రింత బ‌లం చేకూరుతోంది. అదే స‌మ‌యంలో జ‌న‌సేన వైపు మాత్రం మౌన‌మే స‌మాధానం కావ‌డం మ‌రో విశేషంగా క‌నిపిస్తోంది.

జ‌న‌సేన‌తో క‌లిస్తే త‌ప్పేంటి అంటున్న చంద్ర‌బాబు కామెంట్స్ పై జ‌నసేన నుంచి ఒక్క నేత కూడా స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నీసం ట్విట్ట‌ర్ లోన‌యినా మాట్లాడే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ అభిప్రాయం వెల్ల‌డించేందుకు సిద్ధం కాక‌పోవ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. ఇప్ప‌టికే ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వంటి రాజ‌కీయ ఉద్దండులు ప‌వ‌న్ కి స‌ల‌హాలిచ్చారు. భావోద్వేగాల‌తో కూడా అభిమాన‌జ‌నం ప‌వ‌న్ వెంట ఉన్న త‌రుణంలో అధికార పార్టీ మీద పోరాడితే జ‌న‌సేన బ‌ల‌ప‌డుతుంద‌ని, దానికి భిన్నంగా పాల‌క‌ప‌క్షంతో రాజీప‌డితే ప‌వ‌న్ ప్ర‌భావం త‌గ్గిపోతుంద‌నే సూచ‌న చేశారు.

ఈ త‌రుణంలో ప‌వ‌న్ ఏం చేస్తార‌న్న‌ది ప్రశ్నార్థ‌కంగా మారింది. జ‌న‌సైన్యాన్ని గంద‌ర‌గోళానికి గురిచేస్తోంది. వ‌రుస‌గా చంద్ర‌బాబు ప‌దే ప‌దే అదే ప్ర‌క‌ట‌న చేస్తుండ‌డం , జ‌న‌సేన క్యాంప్ నుంచి ఎటువంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో స్ప‌ష్ట‌త కోసం ఎదురుచూస్తున్నారు. అదే స‌మ‌యంలో తెర‌వెనుక పొత్తు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయ‌నే వాద‌న మాత్రం అంతా అంగీక‌రిస్తున్నారు. ప‌వ‌న్ మౌనం దానికి నిద‌ర్శ‌నంగా భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో గ‌తంలో తాము ఎవ‌రితోనూ క‌లిసేది లేద‌ని చెప్పిన ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌ను జ‌న‌సైనికులు గుర్తు చేసుకుంటున్నారు. ఏమ‌యినా ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న కీల‌కం కాబోతోంద‌ని చెప్ప‌వ‌చ్చు.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the love1Shareఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *