Main Menu

అభిమాని అంత్య‌క్రియ‌ల‌కు ప‌వ‌న్ వ‌స్తారా?

Spread the love

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీర‌భిమాని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. బెజ‌వాడ‌లో ఈ విష‌యం క‌ల‌క‌లం రేపుతోంది. పైగా చ‌నిపోయే ముందు నేరుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి లేఖ రాసి మ‌ర‌ణించ‌డం విశేషంగా మారింది. ఆ లేఖ‌ను త‌న అభిమాన హీరో చ‌ద‌వాల‌ని అత‌డు పేర్కొన‌డం విశేషంగా మారింది. విజయవాడకు చెందిన కొమరవల్లి అనిల్‌ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడడంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ని విషాదంలో ముంచింది. తల్‌వాకర్స్‌ జిమ్‌లో ట్రైనర్‌గా అనిల్‌ పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అతడు డిప్రెషన్‌లో ఉన్నట్టు తెలిసింది.

చనిపోయే ముందు పవన్‌ కల్యాణ్‌కు అనిల్‌ ఓ లేఖ రాశారు. దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌, తాను చనిపోయిన తర్వాత చూడటానికి రావాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అంత్యక్రియలు పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దాంతో ప‌వ‌న్ వ‌స్తారా రారా అన్న చ‌ర్చ సాగింది. కానీ చివ‌ర‌కు ప‌వ‌న్ రాకుండానే అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఫారిన్ లో ఉండ‌డంతో ఆయ‌న‌కు ఈ విష‌యం చేర‌కుండానే అనిల్ అంత్య‌క్రియ‌లు ముగిసిపోవ‌డం విశేషం.






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *