Main Menu

ప‌వ‌న్ అమెరికా ప‌య‌నం!

Spread the love

జ‌న‌సేన అధినేత అమెరికా ప‌య‌నం అవుతున్నారు. జ‌న‌సేన అధినేత హోదాలో ఇప్ప‌టికే ఆయ‌న లండ‌న్, అమెరికా ప‌ర్య‌ట‌న‌లు సాగించారు. ఈసారి మ‌ళ్లీ ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌కు స‌న్నాహాలు పూర్త‌య్యాయి. ప్ర‌వాస గ‌ర్జ‌న పేరుతో జ‌న‌సేన అధికారికంగా ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. డిసెంబర్ 7 తేదీన జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్ అమెరికా బ‌య‌లుదేరుతారు. అమెరికాలో భారీ ర్యాలీ నిర్వాహించాల‌ని భావిస్తున్నారు. జ‌న‌సేన ఎన్ఆర్ఐ ప్ర‌తినిధుల‌తో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

వారం రోజుల పాటు ఈ ప‌ర్య‌ట‌న సాగుతుంది. అందులో భాగంగా యూఎస్ లోని ప‌లు న‌గ‌రాల్లో జ‌న‌సేన అభిమానులు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ తో స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. .డిసెంబర్ 15 తేదీన డల్లాస్ లో ఎన్నారైలతో పవన్ సమావేశం ఉంటుంద‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించింది. న్యూయార్క్ స‌హా మ‌రికొన్ని న‌గ‌రాల్లో కూడా ప‌వ‌న్ ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *