Main Menu

లాడ్జీకి రమ్మని ఎస్సై వేధింపులు

Spread the love

ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మహిళా అధికారులకు కూడా రక్షణ లేని స్థితి మొదలయ్యింది. ఏకంగా పోలీస్ సబ్ ఇన్సెక్టర్ కూడా వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడం చర్చనీయాంశం అవుతున్నాయి. అది కూడా రాజధాని జిల్లాలో కావడం విశేషం. నూజివీడు ఎస్సై వేధింపుల వ్యవహారం సంచలనం అవుతోంది. తనను ఎస్సై వేధిస్తున్నట్టు ఓ మహిళ నుంచి ఫిర్యాదు రావడం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.

కృష్ణా జిల్లా నూజివీడు ఎస్సై వెంకటకుమార్‌ తనను లైంగికంగా వేధించారంటూ ఒక మహిళ జిల్లా SPకి ఫిర్యాదు చేశారు. తమ ఆఫీసులోని ఫైలు కనిపించడంలేదని భార్యా, భర్తలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా కలిసిన మహిళపై ఎస్సై వెంకటకుమార్‌ కన్ను పడింది. లాడ్జికి రావాలంటూ ఫోన్‌లో తనను లైంగికంగా తనకు ఎస్సై వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు. ఫోన్‌ టేపులను జిల్లా ఎస్పీకి అందచేశారు. ఇప్పుడీ వ్యవహారం దుమారం రేపుతోంది.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the love13Sharesవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *