ఏపీకి టోపీ పెట్టేశారు…

andhra_graph1467892388
Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆశ‌ల‌కు గండికొట్టేశారు. హోదా ప్ర‌శ్నే లేద‌ని తేల్చేశారు. దాంతో బీజేపీ, టీడీపీ బంధం మీద దాని ప్ర‌భావం ఉంటుంద‌ని ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ప్ర‌స్తుతానికి మాత్రం రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కేంద్రం ఇచ్చిన స‌మాధానం క‌ల‌క‌లం రేపుతోంది. ఏపీకి హోదా హామీ కూడా ఇవ్వ‌లేద‌ని, హోదా ఇచ్చే అవ‌కాశం లేద‌ని తేల్చేయ‌డంతో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. మ‌రోవైపు వైసీపీ అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు ఖాయంగా మారాయి. దాంతో ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వేడి ఖాయంగా క‌నిపిస్తోంది.

ప్ర‌దాన‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర‌మోడీ ఇచ్చిన హామీ, ఆనాటి ప్ర‌ధానిగా ఉన్న మ‌న్మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భ‌లో చెప్పిన మాట‌ల‌ను కేంద్రం తోసిపుచ్చ‌డంద మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. హామీ అమ‌లు చేయ‌మ‌లేమ‌ని చెప్ప‌డం వేరు, అస‌లు హామీ కూడా ఇవ్వ‌లేద‌ని చెప్ప‌డం వేరు. అయినా కేంద్రం మాత్రం తాము హామీ కూడా ఇవ్వ‌లేద‌ని ప్ర‌క‌టించ‌డం ఏపీ ప్ర‌జ‌ల‌ను మోస‌గించ‌డ‌మేన‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. దాంతో బీజేపీ నేత‌లు దానిని ఎలా స‌మ‌ర్థించుకుంటారోన‌నే చ‌ర్చ సాగుతోంది.

ఏమ‌యినా హోదా విష‌యం ఇక మోడీ హ‌యంలో ఏపీకి రాద‌ని తేలిపోయింది. దాంతో హోదా ఇవ్వాల్సిందేన‌ని అడుగుతున్న చంద్ర‌బాబు ఎలాంటి వైఖ‌రి తీసుకుంటారో చూడాలి. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసమే కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్నామ‌ని చెప్పిన త‌రుణంలో, ఇక రాష్ట్ర ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చే అవ‌కాశం లేద‌ని కేంద్రం తేల్చిన త‌ర్వాత ఏం చేయ‌బోతున్నారో చూడాలి. ఇక విప‌క్షాలు ముఖ్యంగా వైసీపీ అవిశ్వాస తీర్మానం కూడా ఆస‌క్తి రేప‌బోతోంది. దానికి మ‌ద్ధ‌తుగా 50మందిని కూడ‌గ‌డ‌తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి.


Related News

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the loveఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

pawantt_4127

త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిప్రాయానికి,Read More

 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • చంద్ర‌బాబుని అవ‌మానిస్తున్న హ‌స్తిన‌!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *