బీజేపీ నేతలకు మళ్లీ చేదు అనుభవం

babu gadkari
Spread the love

భారతీయ జనతాపార్టీ నేతలకు ఏపీలో పదే పదే చేదు అనుభవాలు తప్పడం లేదు. అయినా వారి తీరు మారడం లేదు. దానికి కారణం ఏపీలో బీజేపీ అంటే సీజేపీ అనే కామెంట్స్ ఉన్నాయి. చంద్రబాబు జేబు పార్టీ అంటూ పలువురు విమర్శలు కూడా చేశారు. దానికి తగ్గట్టుగానే బీజేపీ జాతీయ నాయకులు వచ్చినప్పటికీ ఏపీలో మాత్రం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతుంటారు. వెంకయ్యతో మొదలు తాజాగా నితిన్ గడ్కరీ వరకూ ఒకనాటి బీజేపీ జాతీయ అధ్యక్షుల తీరు కూడా అదే రీతిలో ఉండడంతో సాదారణ కార్యకర్తలు తీవ్రంగా సతమతం కావాల్సి వస్తోంది.

ఇక తాజాగా ఏపీ రాజధాని అమరావతి, పోలవరంలో పర్యటించిన నితిన్ గడ్కరీ తీరు దానికి నిదర్శనంగా ఉంది. వాస్తవానికి ఏ రాష్ట్ర రాజధానిలో పర్యటించినా పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలన్నది బీజేపీ అధిష్టానం నిర్ణయం. అందులోనూ దానిని ఖచ్చితంగా అమలుచేయాల్సిన మాజీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ దానికి భిన్నంగా వ్యవహరించారు. ముందుగా సమాచారం ఇవ్వడంతో బీజేపీ సీనియర్ నేతలు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంపీ గోకరాజు, మాజీ కేంద్రం మంత్రి కావూరి, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా తదితరులతో పాటు పలువురు కార్యకర్తలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. దండలు, బొకేల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

కానీ చివరకు గడ్కరీ మాత్రం చంద్రబాబు తో ఎక్కువ సమయం కేటాయించడానికే ప్రాధాన్యతనిచ్చి బీజేపీ ఆఫీస్ మాటే మరచిపోయారు. ముందే సమాచారం ఇచ్చినా తన పార్టీ నేతలు వేచిచూస్తున్నారని తెలిసినా చివరి వరకూ కాలయాపన చేశారు. కానీ చివరకు సాయంత్రం 6గం. లు దాటిన తర్వాత ఫ్లైట్ టైమ్ అయిపోతోందన్న కారణం చూపించి అక్కడి నుంచి జారుకున్నారు. దాంతో బీజేపీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది. గడ్కరీ వస్తున్నారంటూ మీడియాని కూడా ఆహ్వానించడంతో విలేకర్ల ముందు తలవంపులు వచ్చాయని కలత చెందాల్సి వచ్చింది. ఇలా అయితే ఇఖ ఏపీలో బీజేపీ ఎలా మనుగడ సాగిస్తుందనే ప్రశ్న వేసుకుంటూ ఓ సీనియర్ నాయకుడు చల్లగా జారుకవోడం విశేషం.


Related News

ambani, cbn

మోడీ, బాబు మధ్యలో అంబానీ

Spread the loveఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ మధ్య సంబంధాలు ఈనాటివి కాదు. సుదీర్ఘకాలంగా వారికిRead More

rayapati

ఆత్మహత్యాయత్నం వెనుక రాయపాటి కొడుకు

Spread the loveఏపీలో మరో వివాదం రాజుకుంది. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు.Read More

 • చంద్రబాబుపై బీజేపీ నిప్పులు
 • జెండాపీకేసిన జనసేన
 • అమెరికాలోనూ టీడీపీదే అధికారం
 • మరో వైసీపీ వికెట్ డౌన్
 • బోండా ఉమా భార్యను ఇరికించారా?
 • మీరే తేల్చుకోండి…
 • బట్టబయలయిన టీడీపీ నేతల కిడ్నీ రాకెట్
 • అమరావతిలో అలజడి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *