Main Menu

ఆ చానెళ్లు ఆగిపోతాయా?

Spread the love

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన కొత్త టారిఫ్ కొత్త వివాదాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చింది. కేబుల్ ఆప‌రేట‌ర్లు ఇప్ప‌టికే ఆందోళ‌న‌కు పూనుకున్నారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో అన్ని చానెళ్లు అందిస్తున్న త‌మ‌కు అన్యాయం చేసేలా ఉన్న విధానాన్ని పున‌స్స‌మీక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. నెల 29 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్న కొత్త టారిఫ్ కార‌ణంగా ప్రేక్షకులపై అధిక భారం పడుతుందనే వాద‌న వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం ఎమ్మెస్వోలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం రూ.40కే అందిస్తున్నారు. కోర్టు నిర్ణయంతో పే ఛానల్స్‌ అధిక రేట్లు వసూలు చేయ‌బోతున్నారు. టారిఫ్‌ని అమలు చేస్తే ప్రేక్షకులపై రూ.600 భారం పడుతుందని కేబుల్ ఆప‌రేట‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. టారిఫ్‌పై ప్రేక్షకులకు, ఆపరేటర్లకు అవగాహన లేదని, కేంద్రం కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జెమిని , ఈటీవి ,మాటీవి, జీ టీవి నుండి ఒక్కో ఛానల్ ని మాత్రమే ప్రేక్షకులకి అందించబోతున్నామని చెప్పారు. మిగతా చానళ్లని నిలిపివేస్తున్నామని ప్రకటించారు.






Related News

పురందేశ్వ‌రి పోటీ ఎక్క‌డ‌?

Spread the loveఏపీ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. సంక్రాంతి త‌ర్వాత మ‌రింత జోరుగా మార్పులు, చేర్పులు ఉంటాయ‌ని చెబుతున్నారు. అందుకుRead More

బుద్ధా వెంక‌న్న వ్యూహాత్మ‌కంగానే వైసీపీలోకి…!

Spread the loveటీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వ్య‌వ‌హారం ఆది నుంచి చ‌ర్చ‌నీయాంశ‌మే. దుర్గ గుడి వ్య‌వ‌హారాల ఉంచి టీడీపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *