కొత్త పోలీస్ బాస్ కూడా కొన్నాళ్లకే…

malakondayya
Spread the love

ఏపీలో పోలీస్ బాస్ వ్యవహారం రాజకీయంగానూ చర్చనీయాంశం అయ్యింది. చంద్రబాబు ఆశించినట్టుగా నండూరి సాంబశివరావుని కొనసాగించడానికి కేంద్రం ససేమీరా అంది. ఎంత పట్టుబట్టినా చివరకు పట్టు సడలించక తప్పలేదు. దాంతో చివరకు నండూరి స్థానంలో మాలకొండయ్య కొత్త పోలీస్ బాస్ గా నియమితులయ్యారు. బాధ్యతలు కూడా స్వీకరించారు. కానీ మాలకొండయ్య కూడా ముణ్ణాళ్ల ముచ్చటగానే భావిస్తున్నారు. ఆయన కూడా పదవీ విరమణ సమయం తక్కువగా ఉండడంతో 2018లో మరో డీజీపీ నియామకం తప్పనిసరవుతోంది.

ఇక కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ మాల కొండ‌య్య అమ‌రావ‌తిలోని పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యంలో సాంబ‌శివ‌రావు నుంచి మాల కొండ‌య్య బాధ్య‌త‌లు తీసుకున్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కే తొలి ప్రాధాన్య‌మిస్తాన‌ని డీజీపి మాల‌కొండ‌య్య ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ఈ ప‌ద‌విలో ఆరునెల‌ల పాటు కొన‌సాగ‌నున్నారు. ఆయనకు నెల‌కు రూ.2,25,000 వేత‌నంగా నిర్ణ‌యించింది. ప్ర‌కాశం జిల్లాకి చెందిన మాలకొండయ్య 1958లో జ‌న్మించారు. వరుసగా ఇద్దరు డీజీపీలు ప్రకాశం జిల్లా వారే కావడం విశేషంగా చెప్పవచ్చు.






Related News

pawan-mahesh kathi-colalge

కత్తి మహేష్ దే పై చేయి

Spread the loveతాజాగా కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వ్యవహారంలో పవర్ స్టార్ పై సినీ క్రిటిక్ పైRead More

26229518_2027262284224367_6195172877746749936_n

దుమారం రేపేలా ఉన్న బాబుకి కలెక్టర్ల లేఖ

Spread the loveఏపీలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఘాటు లేఖాస్త్రం సంధించింది. చంద్రబాబు తీరుపై తీవ్రంగా వ్యాఖ్యానించింది. అదే సమయంలోRead More

  • మంత్రి నారాయణపై అధికారుల గుస్సా
  • కొత్త పోలీస్ బాస్ కూడా కొన్నాళ్లకే…
  • సీఎంకి ఛాన్స్ లేదు: విజయసాయికి ఎలా?
  • చంద్రబాబు మీద కత్తి
  • చంద్రబాబుకి థాంక్స్ చెప్పిన జగన్
  • నారా లోకేష్ కి అవార్డ్
  • పెనమలూరు ఎమ్మెల్యేపై దాడి
  • జనసేన చుట్టూ జగడం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *