మంత్రి నారాయణపై అధికారుల గుస్సా

narayana
Spread the love

ఆవు మళ్లో మేస్తే..దూడ గట్టున మేస్తుందా అన్నది ఓ నానుడి. కేవలం నానుడే కాదు వాస్తవం అని నిరూపిస్తున్నారు. అధికార పక్ష నేతలు. అందుకు నిదర్శనంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ కనిపిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గంటలకొద్దీ నిర్వహించే సమీక్షలతో అధికారులు తీవ్రంగా సతమతమవుతున్నారు. తమ ఆరోగ్యాలు కూడా దెబ్బతినేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు ఉన్నతాధికారులు కూడా లాంగ్ లీవులతో వెళ్లిపోతున్నారు. కొందరు ఇప్పటికే అలా వెళ్లిపోయారు కూడా.

ఇప్పుడు మంత్రి నారాయణ కూడా దానికి ఏమాత్రం తీసుపోని రీతిలో సాగుతున్నారు. తాజాగా జనవరి 1 సందర్భంగా ప్రపంచమంతా పండుగ చేసుకుంటున్న వేళలో మంత్రి నారాయణ మాత్రం మునిసిపల్ అధికారులను నెల్లూరు రావాలని ఆదేశించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమీక్ష పేరుతో డిసెంబర్ 31 ఆదివారం అయినప్పటికీ ఫైళ్లు పట్టుకుని తన సొంతూరికి రమ్మని ఆదేశాలివ్వడం చాలామందిలో ఆగ్రహం కలిగించింది. సంవత్సారంతంలో పిల్లా పాపలతో సరదాగా గడిపే అవకాశం కూడా లేకుండా సమీక్షలంటూ తన చుట్టూ తిప్పుకోవడంపై నారాయణ తీరును అంతా నిరసిస్తున్నారు. ఇలాంటి శాడిజం పనికిరాదంటూ కొందరు గుస్సా ప్రదర్శిస్తున్నారు.

దాంతో ఏపీలో అధికారుల వ్యవహారం ఆసక్తి రేపుతోంది. మంత్రి నారాయణ తీరు మీద మునిసిపల్ అధికారుల్లో మొదలయిన ఆగ్రహం ఇతర శాఖలకు కూడా పాకుతున్నట్టు సమాచారం. చాలా శాఖల్లో, మంత్రుల పనితీరు ఇదే రీతిలో ఉండడంతో అందరూ కలిసి ఎదుర్కునే ఉద్దేశంతో కనిపిస్తున్నారు. దాంతో ఏపీ పరిపాలనా వ్యవహారాలు చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.


Related News

pawan-mahesh kathi-colalge

కత్తి మహేష్ దే పై చేయి

Spread the loveతాజాగా కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వ్యవహారంలో పవర్ స్టార్ పై సినీ క్రిటిక్ పైRead More

26229518_2027262284224367_6195172877746749936_n

దుమారం రేపేలా ఉన్న బాబుకి కలెక్టర్ల లేఖ

Spread the loveఏపీలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఘాటు లేఖాస్త్రం సంధించింది. చంద్రబాబు తీరుపై తీవ్రంగా వ్యాఖ్యానించింది. అదే సమయంలోRead More

 • మంత్రి నారాయణపై అధికారుల గుస్సా
 • కొత్త పోలీస్ బాస్ కూడా కొన్నాళ్లకే…
 • సీఎంకి ఛాన్స్ లేదు: విజయసాయికి ఎలా?
 • చంద్రబాబు మీద కత్తి
 • చంద్రబాబుకి థాంక్స్ చెప్పిన జగన్
 • నారా లోకేష్ కి అవార్డ్
 • పెనమలూరు ఎమ్మెల్యేపై దాడి
 • జనసేన చుట్టూ జగడం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *