టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌

cbn
Spread the love

తెలుగుదేశం పార్టీని కాపాడాలంటూ ఆపార్టీ నేత‌లే రోడ్డెక్కారు. ఏకంగా ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్ప‌టికే మూడు సార్లు వ‌రుస‌గా ఓట‌మి పాల‌యిన త‌ర్వాత కూడా పార్టీ నేత‌లు క‌ళ్లు తెర‌వ‌డం లేద‌ని వాపోతున్నారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అధిష్టానం స్పందించ‌డం లేదంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. మార్కెట్ యార్డ్ క‌మిటీ చైర్మ‌న్ రామిరెడ్డి దీక్ష‌తో గుంటూరు జిల్లా న‌ర్సారావుపేట టీడీపీ రాజ‌కీయాలు రోడ్డున ప‌డ్డాయి.

ఒక‌ప్పుడు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గంలో 2004 నుంచి టీడీపీ ఓట‌మి పాల‌వుతోంది. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఇన్ఛార్జ్ ని నియ‌మించ‌డంలో పార్టీ అధిష్టానం జాప్యం చేస్తోంది. నేటికీ అది పూర్తిచేయ‌క‌పోవ‌డంతో జిల్లా మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు. జిల్లా పార్టీ అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు, పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌హా అంద‌రికీ కార్య‌క‌ర్త‌లు ప‌దే ప‌దే విన్న‌వించారు. అయినా స్పంద‌న లేక‌పోవ‌డంతో చివ‌ర‌కు త‌న భార్య‌తో క‌లిసి రామిరెడ్డి దీక్ష‌కు పూనుకున్నారు. అయితే సాయంత్రానికి పోలీసులు జోక్యం చేసుకుని దీక్ష‌లో ఉన్న వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వెంట‌నే ఇన్ఛార్జ్ ని నియ‌మించ‌క‌పోతే మొత్తం కుటుంబం అంతా క‌లిసి దీక్ష‌కు పూనుకుంటామ‌ని రామిరెడ్డి ప్ర‌క‌టించడం విశేషంగా మారింది. అయితే టీడీపీ మాత్రం ఇప్ప‌టికే స‌రైన నాయ‌క‌త్వం లేక స‌త‌మ‌తం అవుతున్న త‌రుణంలో ఇప్పుడు ఇలాంటి వ్య‌వ‌హారాలు ఆపార్టీని మ‌రింత ప‌లుచ‌న చేసేలా ఉన్నాయ‌ని ప‌లువురు వాపోతున్నారు. కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడి శివ‌రామ‌కృష్ణ తీరుతో ఈ దీక్ష‌ల‌కు దిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న వ్య‌తిరేక‌, అనుకూల వ‌ర్గాలు విడివిడిగా దీక్ష‌లు సాగించ‌డం చ‌ర్చనీయాంశం అవుతోంది. న ర్సారావు పేట దీక్ష‌ల ప్ర‌భావం జిల్లా అంత‌టా టీడీపీకి న‌ష్టం చేసే అంశంగా మారుతుంద‌ని భావిస్తున్నారు. గ‌తంలో ప్ర‌త్తిపాడులో కూడా నాటి మంత్రి రావెల‌కి వ్య‌తిరేకంగా టీడీపీ ఎంపీపీ దీక్ష‌లు చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.


Related News

akula satyanarayaa

బీజేపీకి ఎమ్మెల్యే గుడ్ బై!

Spread the loveఏపీలో అస‌లే బీజేపీ ప‌రిస్థితి బాగోలేదు. ఆపార్టీకి అన్నీ ఆటంకాలే అన్న‌ట్టుగా మారింది. హోదా ఉద్య‌మం దావానంలోRead More

BJP-AP

గోదారోళ్ల‌కే ప‌ట్టం క‌డుతున్న పార్టీ

Spread the loveక‌మ‌లానికి కొత్త సార‌ధి ఖాయం అయ్యింది. త్వ‌ర‌లోనే నాయ‌కుడెవ‌ర‌న్న‌ది తేల‌బోతోంది. ప‌లువురు ఆశావాహులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.Read More

 • టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌
 • బెజ‌వాడలో వైసీపీ కి కొత్త స‌మ‌స్య‌లా..?
 • అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం
 • బాబుకి షాక్…వైసీపీలోకి కీల‌క నేత‌
 • కాగ్ రిపోర్ట్ ని దాచేసిన ప్ర‌భుత్వం!
 • ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం
 • వైసీపీ రాజీనామాలు: బైఠాయించిన టీడీపీ
 • అయ్యో..నారా లోకేష్!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *