Main Menu

అయ్యో..నారా లోకేష్ మ‌ళ్లీ దొరికిపోయారా?

Spread the love

ఇటీవ‌ల టీడీపీ నేత‌లు ఏమి చేసినా అదో వివాదంగా మారుతోంది. ముఖ్యంగా ఏపీ మంత్రి, చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ ప రిస్థితి మ‌రింత విచిత్రంగా మారుతోంది. తాజాగా అలాంటి వ్య‌వ‌హార‌మే ట్విట్ట‌ర్ సాక్షిగా క‌నిపించింది. అయితే ఆయ‌న ఎన్నో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో క‌లిగించాల‌నే ప్ర‌య‌త్నంలో ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం ప‌రువు తీస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

తాజాగా ఏలూరు నుంచి షేక్ గాలిబ్ అనే అకౌంట్ నుంచి డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించారు. దానిని ప‌రిష్క‌రిస్తామ‌ని లోకేష్ హామీ ఇచ్చారు. కానీ తీరా చూస్తే స‌ద‌రు ట్విట్ట‌ర్ దారుడు 2014లోనే అకౌంట్ తెరిచిన‌ట్టు క‌నిపిస్తోంది. కానీ ఒక్క ట్వీట్ గానీ, ఒక‌రిని ఫాలో అయిన‌ట్టు గానీ, ఆయ‌న‌కు ఒక్క‌రు ఫాలోవ‌ర్ గానీ లేరు. అంటే అలాంటివి ఫేక్ అకౌంట్లుగా ప‌లువురు పేర్కొంటున్నారు.
36718724_242181453229434_5998503384615747584_n

అప్పటికప్పుడు ఖాతాలను క్రియేట్ చేయడం, వాటి ద్వారా ఏవో సమస్యలను చెప్పడం, లోకేష్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం, వాటిపై లోకేష్ స్పందించేసిన‌ట్టు చెప్పుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ వ్య‌వ‌హారం ఉంద‌ని అనేక‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. లోకేష్ ప‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించిన‌ట్టు నెటిజ‌న్ల‌లో అభిప్రాయం క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ట్వీట్ల ప్ర‌హ‌సనం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. దాంతో నారా లోకేష్ చేసిన మ‌రో ప్ర‌య‌త్నం బెడిసికొట్టిన‌ట్ట‌య్యింది. ముఖ్యంగా ట్విట్ట‌ర్ హ్యాండిల్స్ డీల్ చేస్తున్న టీడీపీ సోష‌ల్ మీడియా, లోకేష్ టీమ్ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డ‌మే స‌మ‌స్య‌కు అస‌లు కార‌ణంగా క‌నిపిస్తోంది.






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *