అయ్యో..నారా లోకేష్!

nara lokesh
Spread the love

ఏపీ సీఎం త‌న‌యుడు, నారా లోకేష్ నోరు జారడం ఆన‌వాయితీగా మారింది. అనేక‌సార్లు ఆయ‌న మాట జార‌డంతో అభాసుపాల‌వుతున్నారు. తాజాగా మరోసారి అలాంటి ప‌రిస్థితి ఎదుర‌య్యింది. ఈసారి ఏకంగా అసెంబ్లీలోనే కావ‌డం విశేషం. అది కూడా గ్రామీణ మంచినీటి ఫ‌థ‌కాల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా లోకేష్ య‌ధావిధిగా టంగ్ స్లిప్ప‌య్యారు.

ల‌ఘు చ‌ర్చ‌కు స‌మాధానంగా లోకేష్ మాట్లాడారు. ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. అనంత‌రం త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని భావించిన‌ట్టు క‌నిపించింది. దాంతో నాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో అవాస్త‌వాలు లేవ‌ని పేర్కొన్నారు. అయినా బుర‌ద‌జ‌ల్లుతున్నార‌ని వాపోయారు. దాంతో ఈ వ్యాఖ్య‌ల అస‌లు అర్థం తెలిసిన స‌భ్యులు నోరెళ్ల‌బెట్టాల్సి వ‌చ్చింది. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో అవాస్త‌వాలు లేవంటే అర్థం అన్నీ వాస్త‌వాలేన‌ని. అంటే లోకేష్ కి సంబంధించిన అవినీతి స‌హా వివిధ ఆరోప‌ణ‌ల‌న్నీ నిజ‌మ‌ని స్వ‌యంగా మంత్రి అంగీక‌రించిన‌ట్ట‌య్యింది.

దాంతో విష‌యం గ్ర‌హించిన లోకేష్ స‌ర్థుకున్నారు. త‌న మాట‌ల్లో అస‌లు అర్థంతో స‌భ విస్తుపోయింద‌న్న విష‌యాన్ని తెలుసుకున్నారు. చివ‌ర‌కు త‌న పై చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వాలు ఉంటే ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని స‌వాల్ చేశారు. అందుకు తోడుగా ఏజ‌న్సీ ప్రాంతాల్లో మంచినీటి స‌మ‌స్య గురించి మాట్లాడుతూ ఐటీడీఏని, ఐటీపీఏగా ఉటంకించ‌డంతో ఇత‌ర ఎమ్మెల్యేలు స‌రిచేయాల్సి వ‌చ్చింది. దాంతో లోకేష్ తీరు మార‌లేద‌నే అభిప్రాయం ప‌లువురు వ్య‌క్తం చేసే ప‌రిస్థితి క‌నిపించింది.


Related News

akula satyanarayaa

బీజేపీకి ఎమ్మెల్యే గుడ్ బై!

Spread the love8Sharesఏపీలో అస‌లే బీజేపీ ప‌రిస్థితి బాగోలేదు. ఆపార్టీకి అన్నీ ఆటంకాలే అన్న‌ట్టుగా మారింది. హోదా ఉద్య‌మం దావానంలోRead More

BJP-AP

గోదారోళ్ల‌కే ప‌ట్టం క‌డుతున్న పార్టీ

Spread the love4Sharesక‌మ‌లానికి కొత్త సార‌ధి ఖాయం అయ్యింది. త్వ‌ర‌లోనే నాయ‌కుడెవ‌ర‌న్న‌ది తేల‌బోతోంది. ప‌లువురు ఆశావాహులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.Read More

 • టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌
 • బెజ‌వాడలో వైసీపీ కి కొత్త స‌మ‌స్య‌లా..?
 • అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం
 • బాబుకి షాక్…వైసీపీలోకి కీల‌క నేత‌
 • కాగ్ రిపోర్ట్ ని దాచేసిన ప్ర‌భుత్వం!
 • ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం
 • వైసీపీ రాజీనామాలు: బైఠాయించిన టీడీపీ
 • అయ్యో..నారా లోకేష్!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *