Main Menu

చిన‌బాబు సీటు క‌న్ఫ‌ర్మ్!

Spread the love

ఏపీలో ముఖ్య‌మంత్రి త‌నయుడు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తొలిసారిగా ప‌రోక్ష ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీగా చ‌ట్టస‌భ‌ల్లో అడుగుపెట్టిన నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో దింగేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న ఆయ‌న సుర‌క్షిత స్థానం కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే చాలాకాలంగా ఆయ‌న ఆశిస్తున్న కృష్ణా జిల్లాలోనే చిన‌బాబుకి కొంత సేఫ్ జోన్ గా భావిస్తున్నారు.

దాంతో తొలుత చంద్ర‌గిరి వైపు క‌న్నేసిన నారా లోకేష్ తాజాగా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో పోటీకి ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు క‌నిపిస్తోంది. పెన‌మ‌లూరు స్థానంలో కూడా కొంత దృష్టి సారించిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు గ‌న్న‌వ‌రం అన్నింటిక‌న్నా మెరుగైన సీటుగా భావిస్తున్నారు. గ‌డిచిన అనేక సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డ టీడీపీక గ‌ట్టిప‌ట్టు ఉండ‌డం. పైగా విప‌క్షం కొంత బ‌ల‌హీనంగా క‌నిపిస్తుండ‌డంతో నారా లోకేష్ కి సునాయాసంగా గ‌ట్టెక్కే అవ‌కాశాలుంటాయ‌ని టీడీపీ నేత‌లు ఆశిస్తున్నారు.

అందుకు తోడుగా ప‌ట్టిసీమ ప్రాజెక్ట్ ఫ‌లాలు కూడా అందుకున్న నియోజ‌క‌వ‌ర్గం గ‌న్న‌వ‌రం కావ‌డం విశేషం. ఆ రీత్యా చూసిన రైతాంగంలో కొంత సంతృప్తిశాతం ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. మొత్తంగా చిన‌బాబు నేరుగా ఎన్నిక‌ల రంగంలో దిగితే దానికి అనువైన స్థానం గ‌న్న‌వ‌రం అని దాదాపు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టుగా భావిస్తున్నారు. అదే జ‌రిగితే గ‌న్న‌వ‌రం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. గ‌డిచిన ఎన్నికల్లో కూడా ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి సీటు సాధించారు. మ‌రోసారి త‌న ప్రాభ‌వం కాపాడుకోవాల‌ని ఆశిస్తున్న నేప‌థ్యంలో నారా లోకేష్ ఎంట్రీ ఆయ‌న‌కు అశ‌నిపాతంగా మారే ప్ర‌మాదం ఉంది. ఆయ‌న్ని ఎలా సంతృప్తి ప‌రుస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే.






Related News

అమరావతిలో మళ్లీ లీకులు

Spread the love ఏపీ రాజధాని అమరావతిలో లీకుల పర్వం సాగుతోంది. గతంలో ప్రతిపక్ష నేత ఛాంబర్ లో లీకులొచ్చాయి.Read More

జోరు పెంచిన టీడీపీ!

Spread the loveటీడీపీ వ్యూహం మార్చింది. రాజ‌కీయంగా మ‌నుగ‌డ సాగించాలంటే మీడియాలో కొత్త పంథా అవ‌స‌రం అని గ్ర‌హించింది. దానికిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *