Main Menu

లోకేశ్ సాహ‌సం చేస్తారా..!?

Spread the love

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా ఈనాడు ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం లోకేశ్ దృష్టి భీమిలి మీద ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. పెద‌కూర‌పాడు, పెన‌మ‌లూరు వంటి స్థానాల‌ను ప‌రిశీలించిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు భీమిలి స్థానం వైపు ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది.

విశాఖ జిల్లాలోని భీమిలి చాలాకాలంగా టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం. గ‌తంలో 2004,09 లో మాత్రం ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. 2009లో మూడోస్థానంతో స‌రిపెట్టుకుంది. అయితే 2014లో మ‌ళ్లీ గంటా శ్రీనివాస‌రావు పోటీ చేయ‌డంతో ఘ‌న‌విజ‌యం ద‌క్కించుకుంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ త‌న సిట్టింగు సీటు మార్చి విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాల‌ని గంటా ఆలోచిస్తున్నారు. అయితే ఆయ‌న్ని పార్ల‌మెంట్ బ‌రిలో దింపాల‌ని చంద్ర‌బాబు ఆశిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో భీమిలి నుంచి నారా లోకేశ్ పోటీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు వ‌స్తున్న క‌థ‌నాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. భీమిలి కాపు, మ‌త్స్య‌కార‌, యాద‌వ సామాజిక‌వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉండే నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డి నుంచి వైసీపీ త‌రుపున అవంతి శ్రీనివాస్ పోటీ చేయ‌బోతున్నారు. ఆయ‌న గ‌తంలో ప్రజారాజ్యం త‌రుపున భీమిలి నుంచి గెలిచారు. ఈ నేప‌థ్యంలో మాజీ ఎమ్మెల్యేతో లోకేశ్ త‌ల‌ప‌డితే పోటీ తీవ్రంగా ఉంటుంది. సామాజికంగా లోకేశ్ కి కలిసివ‌చ్చే అవ‌కాశం లేదు. దాంతో తీవ్రంగా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. లోక‌ల్ గా ప‌ట్టున్న అవంతి శ్రీనివాస్ తో లోకేశ్ త‌ల‌ప‌డే సాహ‌సం చేసే అవ‌కాశం లేద‌ని ప‌లువురు అంచ‌నాలు వేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఈనాడు క‌థ‌నం వెనుక కారణాలు వేరుగా ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the love1Shareఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *