అమెరికాలోనూ టీడీపీదే అధికారం

nara lokesh
Spread the love

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. న్యూజెర్సీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో లోకేష్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే ఈ ఏపీ యువ మంత్రి వ్యాఖ్యలు అనేకమార్లు ఆశ్చర్యంగానూ, ఆసక్తిగానూ సాగాయి. తాజాగా చేసిన మరింత విస్మయకరంగా మారాయి. ముఖ్యంగా యూఎస్ లో టీడీపీ కార్యకర్తల జోరు చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోందని నారా లోకేష్ చేసిన కామెంట్ చాలామందిని నోరెళ్లబెట్టేలా చేసింది.

అంతకుముందు కార్యకర్తల సమావేశంలో కూడా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారన్నారు. 67 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల కుర్రాడిలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. అందుకే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని తెలిపారు.

లోకేష్ వ్యాఖ్యలను బట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అమెరికా నుంచి పోటీ చేస్తారేమో అన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Related News

jaleelkhan

ఆ ఎమ్మెల్యేకి హ్యాండివ్వబోతున్న చంద్రబాబు

Spread the love6Sharesఏపీ రాజధాని రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులోనూ బెజవాడ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అందుకుRead More

MLA Alla Ramakrishna Reddy (2)

వైసీపీ ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు

Spread the love4Sharesఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రుష్ణారెడ్డికిRead More

 • కన్నా కమల దళపతి కావడానికి కారణం అదేనా?
 • జనసేనకు కన్నం కొట్టి..వైసీపీ కి?
 • ఆయన్ని మార్చేసిన జగన్
 • మళ్లీ నీరుగారిపోయిన జగన్ ఛాంబర్
 • టీడీపీ బలం మీద దెబ్బకొట్టిన జగన్
 • జనసేనకి లోకేష్ సవాల్
 • బాబుకి మరో దెబ్బ: టీడీపీ నుంచి జంపింగ్
 • వైసీపీ వైపు క‌న్నా క‌న్ను
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *