టీడీపీకి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించిన ఎమ్మెల్యే

తెలుగుదేశం నుంచి మరో వికెట్ పడుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనలో చేరిపోయారు. తాజాగా మరో సీనియర్ నేత సిద్ధమయ్యారు. రెండో వికెట్ కూడా గుంటూరు జిల్లా నుంచే కావడం విశేషంగా చెప్పవచ్చు. ఈసారి గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వంతు వచ్చింది. టీడీపీలో తన పరిస్థితి బాగోలేదని, గురజాలలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ కి గుడ్ బై చెబుతున్నాననడానికి సంకేతంగా స్పష్టమవుతోంది.
మోదుగుల గతంలో నర్సారావుపేట నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాయపాటి కోసం ఆ సీటు ఖాళీ చేయిస్తూ మోదుగులను అసెంబ్లీ బరిలో దింపారు. అయితే వేణుగోపాల్ రెడ్డికి ఇచ్చిన మంత్రి పదవి హామీ నెరవేరలేదు. దాంతో టీడీపీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆక్రమంలోనే వైసీపీ లో చేరి వచ్చే ఎన్నికల్లో నర్సారావు పేట ఎంపీ సీటుకి బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే నర్సారావుపేట ఎంపీ సీటు ఇప్పటికే విజ్ఞాన్ రత్తయ్య మనవడు శ్రీకృష్ణదేవరాయులకి కేటాయించేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలో మోదుగుల పరిస్థితి ఏమిటదన్నది చర్చనీయాంశం అవుతోంది.
తాజాగా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఓ గార్డెన్ పార్టీలో ఆయన మాట్లాడారు. రెడ్డి సామాజికవర్గానికి టీడీపీ ప్రభుత్వంలో పరిస్థితి బాగోలేదని తేల్చేశారు. గురజాలలో మనవాడినే గెలిపించాలంటూ సామాజిక కోణంలో మాట్లాడారు. తాను నర్సారావుపేట నుంచే పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. దాంతో ఇప్పుడీ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదుగుల టీడీపీని వీడబోతున్నట్టు అధికార పార్టీ ఓ నిర్ధారణకు వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన గుంటూరు వెస్ట్ మీద ఆశలు వదులుకుని వైసీపీ వైపు చూస్తున్నారనే వాదన టీడీపీ నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోదుగుల ముహూర్తం ఎప్పుడదన్నదే ఇక మిగిలిందని చెప్పవచ్చు.
Related News

ఎన్టీఆర్ సినిమా అడ్డుకోండి చంద్రబాబు పిలుపు
Spread the loveఏపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవాలన్నారు. టీడీపీ శ్రేణులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లోRead More

అంబటికి జగన్ ఝలక్!
Spread the loveవైసీపీ లో గట్టిగా పార్టీ వాణీ వినిపించే నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. ఆది నుంచి జగన్Read More