Main Menu

జ‌గ‌న్ అనూహ్య నిర్ణ‌యం: వేడి పెంచిన మోదుగుల‌

Spread the love
  • 423
    Shares

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఊగిస‌లాట వీడింది. టీడీపీని వీడే ప్ర‌క్రియ పూర్త‌య్యింది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ అనూహ్య నిర్ణ‌యం ఇప్పుడు రాజ‌కీయంగా వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా మోదుగుల భ‌విత‌వ్యానికి సంబంధించి జ‌గ‌న్ వ్యూహం క‌ల‌క‌లం రేపుతోంది. గుంటూరు జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన స్థానాల్లో పొన్నూరు ఒక‌టి. ఒక్క‌డి నుంచి వ‌రుస‌గా నాలుగు సార్లు టీడీపీ త‌రుపున ధూళిపాళ న‌రేంద్ర విజ‌యం సాధించారు. వైఎస్సార్ హ‌యంలో కూడా టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

ఈ నేప‌థ్యంలో పొన్నూరు బ‌రిలో మోదుగులను దింపేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్రచారం సాగుతోంది. అదే జ‌రిగితే పొన్నూరు పొలిటిక్స్ ఒక్క‌సారిగా వేడెక్కుతాయ‌న‌డంలో సందేహం లేదు. మోదుగుల వంటి బ‌ల‌మైన నేత బ‌రిలో ఉంటే ధూళిపాళ న‌రేంద్ర‌కు చిక్కులు త‌ప్ప‌వు. ఇప్ప‌టికే నాలుగు సార్లు గెలిచిన నేపథ్యంలో ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ట్ల ప్ర‌జా వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ త‌రుణంలో అసాధార‌ణంగా మోదుగుల ముందుకు రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారుతోంది.

వైసీపీ శ్రేణుల‌కు ఈ నిర్ణ‌యం ఊపిరిపోసిన‌ట్ట‌వుతుంద‌ని పొన్నూరు నేత‌లు చెబుతున్నారు. ఇప్ప‌టికే న‌ర్సారావుపేట ఎంపీగానూ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగానూ ఆయ‌న‌కు మంచి గుర్తింపు ఉంది. ఆర్థిక ద‌న్ను ఉంది. ఇదే ఇప్పుడు న‌రేంద్ర‌ను ఢీకొట్టే నేత‌గా ఆయ‌న ముందుకు రావ‌డానికి కార‌ణంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో ఈ సీటు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the love1Shareఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *