Main Menu

మింగుడుపడని మోదుగుల

Spread the love
  • 13
    Shares

టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యవహారం మింగుడుపడడం లేదు. అధికార పార్టీ ని వీడకుండానే పార్టీ నేతలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న ఆయన తీరు కలకలం రేపుతోంది. అయితే ఈ విషయంలో అస్పష్టత తొలగించేందుకు చివరకు గుంటూరు ఎంపీ రంగంలో దిగారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడినట్లేనని గల్లా జయదేవ్‌ అన్నారు.

పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఆశావహులు, పార్టీ నగర నేతలతో ఎంపీ గల్లా జయదేవ్‌ నిర్వహించిన సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. మోదుగుల వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. మోదుగుల తీరుతో తమకు సమస్యలు ఎదురువుతున్నారని వాపోయారు.

దాంతో గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యే కావటంతో మోదుగుల వైఖరిని సహించాల్సి వచ్చిందని వివరించారు. సీఎం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు సైతం మోదుగుల రాకపోవటంతో పార్టీని వీడుతునట్లు స్పష్టమైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో అందరిని కలుపుకొనిపోయే అభ్యర్థినే అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి గల్లా అరుణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ టికెట్ కోసం ఇప్పుడు టీడీపీలో పోటీ పెరుగుతున్న తరుణంలో వీలయినంత త్వరగా పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని ఆపార్టీ ఆశిస్తోంది.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the love1Shareఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *