మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!

narayana_4231
Spread the love

ఏపీ మంత్రి నారాయ‌ణ వ్య‌వ‌హారం మామూలుగా ఉండ‌దు. బ‌డా వ్యాపారిగా గుర్తింపు పొంది ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి వ‌చ్చారాయ‌న‌. ప్ర‌జ‌ల‌తో పెద్ద‌గా సంబంధం లేకుండానే పెద్ద‌ల స‌భ‌లో అడుగుపెట్టారు. ఆ వెంట‌నే అమాత్య హోదా ద‌క్కింది. కీల‌క‌మైన ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ పేరుతో రాజ‌ధాని వ్య‌వ‌హారాలన్నీ ఆయ‌న చేతుల్లోనే ఉన్నాయి. దాంతో ఆయ‌న ప్రాధాన్య‌త‌గ‌ల మంత్రిగా మారిపోయారు. కానీ పాత్రికేయులు మాత్రం ఈ మంత్రిని చూస్తే భ‌య‌ప‌డుతున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతంలో జ‌ర్న‌లిస్టుల‌యితే నారాయ‌ణ పేరెత్తితేనే ప‌రార‌వుతున్నారు. జ‌ర్న‌లిస్టులను ఓ రేంజ్ లో భ‌య‌పెడుతున్న మంత్రి వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మీడియా ప్ర‌తినిధుల‌న‌గానే దాదాపుగా నారాయ‌ణ కాలేజీ సిబ్బంది త‌ర‌హాలో ఆయ‌న ట్రీట్ చేస్తున్నార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఆయ‌న ఓ మీడియా స‌మావేశం పెట్టాల‌నుకుంటే ఉద‌యాన్నే ఏడుగంట‌కు ఏర్పాటు చేస్తారు. దాంతో ఆరుగంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో వెహిక‌ల్ పెడ‌తారు. పైగా ఆ స‌మావేశానికి సంబంధించిన స‌మాచారం మాత్రం రాత్రి 11 దాటిన త‌ర్వాత పంపిస్తుండ‌డంతో ప‌లువురికి హైరానా త‌ప్ప‌డం లేదు. వార్త మంత్రి కోసం కాక‌పోయినా , చానెల్ యాజ‌మాన్యం కోస‌మ‌యినా క‌వ‌ర్ చేయాల్సిన బాధ్య‌త విలేక‌రిది. అయితే స‌మాచారం అంద‌డ‌మే అర్థ‌రాత్రి కావ‌డం, తెల్లారి లేవ‌గానే ఆద‌రాబాద‌ర‌గా వెళ్లాల్సి రావ‌డంతో చాలామంది తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. పైగా ప్ర‌తీసారి అదే ప‌ద్ధ‌తిలో సాగుతుండ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

అంతేగాకుండా ఏకంగా తెల్ల‌వారు 5 గంట‌లకే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఘ‌న‌త నారాయ‌ణ‌ది కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అయినా మంత్రి పేషీ సిబ్బంది మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. పైగా త‌మ మంత్రికి అప్పుడే తీరుబ‌డి అన్న‌ట్టుగా చెబుతుండ‌డంతో చాలామంది మొఖాలు తేలేస్తున్నారు. అందుకు తోడుగా నెల‌కు మూడు నాలుగు సార్లు విజిట్స్ పేరుతో అమ‌రావ‌తిలో ఆయ‌న చేస్తున్న హంగామా వ‌ల్ల ఫ‌లితాలు ఏమిటో కూడా అర్థంకాకుండాపోతోంది. ప్ర‌తీ నెలా క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు నాలుగు సార్లు తెల్లారే లేచి బ‌య‌లుదేరుతున్న‌ప్ప‌టికీ అందులో వార్త సారాంశం లేక‌పోవ‌డంతో చాలామంది బిక్క‌మొఖాలు వేయాల్సి వ‌స్తోంది. రాజ‌ధాని డిజైన్లే ఖ‌రారు చేయ‌లేని మంత్రి తెల్ల‌వారి విలేక‌ర్ల‌కు మాత్రం తిప్ప‌లు మిగిలిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.


Related News

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the loveఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

pawantt_4127

త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిప్రాయానికి,Read More

 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • చంద్ర‌బాబుని అవ‌మానిస్తున్న హ‌స్తిన‌!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *