Main Menu

వైసీపీకి షాకిచ్చి, జ‌న‌సేన‌లోకి..!

Spread the love

ఏపీలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. వారు వీర‌వుతార‌న్న‌ట్టుగా ప‌రిస్థితులు మారుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా ఈ వ్య‌వ‌హారాల‌ను తాను సొమ్ము చేసుకోవాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశిస్తున్నారు. జ‌నసేన బ‌లోపేతం కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ప్ర‌జారాజ్యంతో పోలిస్తే జ‌న‌సేన‌లో సీనియ‌ర్లు, జ‌నాల మ‌ద్ధ‌తు ఉన్న నేత‌లు త‌క్కువ‌గా ఉన్నార‌నే వాద‌న తుడిచిపెట్టేయాల‌ని ప‌వ‌న్ ఆశిస్తున్నారు. అందులో భాగంగా ప‌లువురు నేత‌ల‌తో ఆయ‌న మంత‌నాలు జ‌రుపుతున్నారు.

అదే స‌మ‌యంలో జ‌న‌సేన అంటే ఓ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పార్టీ కాద‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నాల్లో పవ‌న్ ఉన్నారు. అలాంటి ముద్ర బ‌ల‌ప‌డ‌కుండా చూసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా ఇత‌ర పార్టీల్లోని సీనియ‌ర్ నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవడానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తాజాగా నాదెండ్ల మ‌నోహ‌ర్ చేరిక‌తో ఈ వ్య‌వ‌హారాల‌కు ఊపు వ‌స్తుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు ఈ ప‌రంప‌ర‌లో జ‌న‌సేన కండువాలు క‌ప్పుకునే వారి జాబితాలో ఉండ‌గా తాజాగా వైసీపీ సీనియ‌ర్ నేత పేరు ముందుకొచ్చింది. తాజాగా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో జ‌గ‌న్ త‌న‌ను కాద‌ని విడ‌ద‌ల ర‌జ‌నీకి టికెట్ ఖాయం చేసిన నేప‌థ్యంలో మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో త‌మ‌వైపు వ‌స్తే సీటు గ్యారంటీ అంటూ జ‌న‌సేన ఆఫ‌ర్ చేయ‌డంతో ఆయ‌న‌లో కొత్త ఆశ‌లు మొద‌ల‌వుతున్నాయి. వైసీపీ జిల్లా అధ్య‌క్షుడిగా ప‌నిచేసి, పార్టీ అభివృద్ధికి పాటుప‌డిన త‌న‌ను కాద‌న‌డంతో త‌ట్టుకోలేక‌పోతున్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ తో ప‌వ‌న్ అనుచ‌రులు మంత‌నాలు జ‌రుపుతున్న విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

జ‌న‌సేన టికెట్ ఖాయం చేస్తే తాను వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు రాజ‌శేఖ‌ర్ సంకేతాలు ఇస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయ‌న‌పై అభిమానుల ఒత్తిడి క‌నిపిస్తోంది. స‌హ‌చ‌రుల సూచ‌న‌తో ఆయ‌న వైసీపీ నుంచి జ‌న‌సేన‌లో కి జంప్ చేసే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతున్న త‌రుణంలో చిల‌క‌లూరిపేట రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. అస‌లే బ‌ల‌మైన నేత‌గా ఉన్న మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకి ఈ ప‌రిణామాలు మ‌రింత బ‌లం చేకూర్చే అవ‌కాశాలున్నాయ‌నే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో జ‌గ‌న్ వ‌ర్గీయులు కూడా మ‌ర్రికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నాలు సాగించే అవ‌కాశం ఉంది. అయినా ఆయ‌న వెన‌క్కి త‌గ్గుతారా లేదా అన్న‌ది సందేహంగానే చెప్ప‌వ‌చ్చు.






Related News

అమ‌రావ‌తి వైసీపీలో ఆస‌క్తిక‌ర మలుపు

Spread the love3Sharesవిప‌క్ష వైసీపీలో వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లాకు చెందిన ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి. ఇప్ప‌టికే గుంటూరుRead More

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the love19Sharesవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *