Main Menu

వైసీపీ తెర‌పైకి కొత్త త‌గాదా

Spread the love

వైసీపీలో విబేధాలు ఒక్కోక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్య‌వ‌హారం స‌మ‌సిపోయే దిశ‌లో ఉంద‌ని సంతోష‌ప‌డుతుండ‌గా మంగ‌ళ‌గిరి త‌గాదా ముందుకొచ్చింది. రాజధాని పరిధిలోని వివాదం రాష్ట్ర‌మంతా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైసీపీలో ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఈ ముసలం మొదలైంది. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తే వైసీకి చెందినకొంద‌రు ముఖ్యనేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం అధినేతపై అసంతృప్తితో అజ్ఞాతంలోకి వెళ్లి‌పోయార‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు.

ఆయన ఎవరికీ ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెక్‌ పెట్టేందుకు పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం నేతలు మున్నంగి గోపిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి పావులు కదిపారు. మంగళగిరికి చెందిన టీడీపీ, బీజేపీ, సీపీఎం కౌన్సెలర్లు ఉడతా శ్రీను, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర శకుంతలను జగన్‌ సమక్షంలో వైసీపీలో చేర్పించారు. ఈ పరిణామం ఆళ్ల వర్గానికి షాక్‌కు గురిచేసింది. ఉడతా శ్రీనును మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల వ్యతిరేక వర్గం ప్రచారం చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆళ్ల సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంగళగిరి పట్టణం, రూరల్‌, తాడేపల్లి పట్టణం, రూరల్‌, దుగ్గిరాల మండలాలకు చెందిన వైసీపీ కన్వీనర్లు, పలువురు వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మంగళగిరి ఎంపీపీ తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. ఇది ఇప్పుడు ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ఈ స‌మ‌స్య వైసీపీలో ఎలాంటి మ‌లుపులు తీసుకుంటుందోన‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది.






Related News

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

2019 వైసీపీ అభ్యర్థుల విశ్లేషణ

Spread the loveబీసీలకు, అనుభవానికి, నమ్మకానికి, పెద్దపీట యువతకు సముచిత ప్రాధాన్యం అభ్యర్థుల్లో పెద్దసంఖ్యలో ఉన్నతచదువులు చదువుకున్నవారు అభ్యర్థుల్లో 9Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *