వినుకొండలో స్పైడర్ చిచ్చు

mahesh
Spread the love

స్పైడర్ మువీ చిచ్చు పెట్టింది. వినుకొండలో వివాదానికి కారణమయ్యింది. దుమారం రేపింది. సూపర్ స్టార్ అభిమానులు వీరంగం చేసే వరకూ సాగింది. గుంటూరు జిల్లా వినుకొండలో ప్రిన్స్ మహేష్ బాబు రెచ్చిపోవడం కలకలం రేపింది. విడుదకు సిద్ధమైన ‘స్పైడర్’ చిత్రం బెనిఫిట్ షో వేస్తామని తమకు టికెట్లు విక్రయించిన థియేటర్ ప్రదర్శనను ఆలస్యం చేయడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, తెరను చించి వేయడంతో పాటు సీట్లను ధ్వంసం చేశారు. థియేటర్ అద్దాలను రాళ్లు విసిరి పగులగొట్టారు. ఉదయం 6 గంటలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని చెప్పి తమ నుంచి రూ. 500 చొప్పున ఒక్కో టికెట్ కు వసూలు చేశారని ఈ సందర్భంగా అభిమానులు ఆరోపించారు. సినిమా ఆలస్యం చేస్తూ, ఉదయం 10 గంటలకే బెనిఫిట్ షో అని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో, రెచ్చిపోయారు. రిలీజ్ రోజు మార్నింగ్ షో టికెట్లనే తమకు బెనిఫిట్ షో పేరిట అధిక ధరలకు అమ్ముకున్నారని ఆరోపించారు. తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులను అదుపు చేశారు.






Related News

BJP-AP

గోదారోళ్ల‌కే ప‌ట్టం క‌డుతున్న పార్టీ

Spread the loveక‌మ‌లానికి కొత్త సార‌ధి ఖాయం అయ్యింది. త్వ‌ర‌లోనే నాయ‌కుడెవ‌ర‌న్న‌ది తేల‌బోతోంది. ప‌లువురు ఆశావాహులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.Read More

cbn

టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌

Spread the loveతెలుగుదేశం పార్టీని కాపాడాలంటూ ఆపార్టీ నేత‌లే రోడ్డెక్కారు. ఏకంగా ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం హాట్Read More

  • బెజ‌వాడలో వైసీపీ కి కొత్త స‌మ‌స్య‌లా..?
  • అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం
  • బాబుకి షాక్…వైసీపీలోకి కీల‌క నేత‌
  • కాగ్ రిపోర్ట్ ని దాచేసిన ప్ర‌భుత్వం!
  • ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం
  • వైసీపీ రాజీనామాలు: బైఠాయించిన టీడీపీ
  • అయ్యో..నారా లోకేష్!
  • జ‌న‌సేన‌లో అనూహ్య ప‌రిణామం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *