Main Menu

బంద‌రు టీడీపీలో గంద‌ర‌గోళం

Spread the love

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై ఎడతెగని ఉత్కంఠత నెలకొంది. పార్లమెంట్ అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరిని బరిలో నిలుపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకే దాదాపు అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ సమీకరణలు రకరకాల ఊహాగానాలకు తెర లేపింది.

నిన్న మొన్నటి వరకు వంగవీటి రాధాకృష్ణ పేరును వినిపించగా ఇప్పుడు అనూహ్యంగా మాజీ డెప్యూటీ స్పీకర్, ముడ చైర్మన్‌గా కొనసాగుతున్న బూరగడ్డ వేదవ్యాస్ పేరు తెర మీదకు వచ్చింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వేదవ్యాస్‌ను పార్లమెంట్ బరిలో నిలిపి సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావును పెడన అసెంబ్లీ నుండి పోటీ చేయించాలనే ఆలోచనలో అధినేత చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణతో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. తొలుత వంగవీటిని బందరు పార్లమెంట్ బరిలో నిలవాలని చంద్రబాబు సూచించారు.

అయితే అనుకోకుండా రాధా స్థానంలో వేదవ్యాస్ పేరు తెర మీదకు రావటంతో సరికొత్త ప్రచారానికి తెర లేపినట్టైంది. ఇదే విషయమై గురువారం రాత్రి జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వేదవ్యాస్ తనయుడు కిషన్ తేజకు, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది. అదీ కాకుండా రాజకీయాల్లో బూరగడ్డ కుటుంబానికి ఒక ప్రత్యేక స్తానం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బూరగడ్డకు ఎంపీ సీటు ఇచ్చినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు.






Related News

రీపోలింగ్ త‌ప్ప‌లేదు..

Spread the loveఏపీ ఎన్నిక‌ల్లో రీపోలింగ్ త‌ప్ప‌లేదు. రాష్ట్రంలోని మూడు జిల్లాల ప‌రిధిలో రీపోలింగ్ కి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.Read More

వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టిగా పోరాడినా చివ‌రిలో చ‌తికిల‌ప‌డింది. ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని ఆశిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *