మళ్లీ లగడపాటే..

Lagadapati-488585-300x239
Spread the love

లగడపాటి రాజగోపాల్ ఘనాపాటి అనిపించుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాజకీయ అంచనాలు మాత్రం తప్పడం లేదు. ఎన్నికల విశ్లేషణలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు సంపాదించిన లగడపాటి తాజాగా నంద్యాల ఫలితాలతో తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఎన్నికల సర్వేలలో తాను సిద్ధహస్తుడినని చాటుకున్నారు.

తాజాగా నంద్యాల ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు సర్వేలు చేశాయి. అప్ డేట్ ఏపీ కూడా సర్వే చేసినా ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. కానీ లగడపాటి సర్వే మాత్రం వాస్తవాలకు అతి చేరువలో ఉండడం విశేషం. అయితే ఈసారి సర్వేను ఆయన ప్రకటించలేదు. కేవలం మీడియా ఆయన దగ్గర సమచాారం కోసం ఆరా తీసినప్పుడు మాత్రమే వివరించారు. ప్రభుత్వానికి సానుకూలత ఉందని, సానుభూతి ఉందని, పోలింగ్ శాతం పెరగడం టీడీపీకి అనుకూలంగా మారుతోందని ఆయన ముందే విశ్లేషించారు. అదే సమయంలో భారీ మోజార్టీ ఖాయం అని కూడా తేల్చిచెప్పారు. ఆయన లెక్కలకు తగ్గట్టుగానే ఫలితాలు రావడంతో మరోసారి లగడపాటి సర్వేల మహత్యం అందరూ అంగీకరిస్తున్నారు.

ఇప్పటికే 2009 ఎన్నికలు, 2014 ఎన్నికలు, మధ్యలో ఉప ఎన్నికలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికలను కూడా లగడపాటి అతి చేరువగా సర్వేలు వెల్లడించి సంచలనం రేపారు. ఇప్పుడు మరోసారి సర్వేని సమగ్రంగా, వాస్తవానికి చేరువగా వెల్లడించి తన సామర్థ్యం నిరూపించకోవడంతో ఆయన మీద ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోంది. భవిష్యత్తులో లగడపాటి సర్వేలకు మరింత ప్రాధాన్యత ఏర్పడుతోంది.


Related News

vallabanenivamsi11482231951

బాబు తీరుపై వల్లభనేని వంశీ అసహనం

Spread the loveఏపీ టీడీపీ ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీది బిన్నమైన శైలి. గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన అనేకRead More

amaravati-design-rajamouli

అమరావతికి రాజమౌళి డిజైన్

Spread the loveవిజువల్ వండర్ గా బాహుబలిని నిలిపిన దర్శకుడు ఏపీ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర వహించడం ఖాయమనిRead More

 • బాధ్యతల నుంచి తప్పుకుంటానంటున్న మంత్రి
 • జ‌న‌సేనాని కృత‌జ్ఞ‌త‌లు
 • నేను దూర‌మే అంటున్న ల‌గ‌డ‌పాటి
 • పార్టీ పరువు తీసుకుంటున్న వైసీపీ నేతలు
 • కలకలం రేపిన హీరో నిఖిల్
 • బాబు ముందుకు బెజవాడ పంచాయితీ
 • మళ్లీ లగడపాటే..
 • టీడీపీదే విజయం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *