Main Menu

టీడీపీలోకి బిగ్ బాస్

Spread the love

టీడీపీకి బిగ్ బాస్ దొరికాడు. సొంతంగా త‌న పేరుతో ఆర్మీ ఏర్పాటు చేసుకుని బిగ్ బాస్ షోలో ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కౌశ‌ల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌ట్టుగానే భావించ‌వ‌చ్చు. ఆపార్టీ కి ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంటాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అందులో భాగంగా సీఎం చంద్ర‌బాబుని క‌లిశారు.

మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన కౌశల్.. బాబుతో భేటీ అయ్యారు. టిడిపితో కలసి పని చేయడానికి కౌశల్ సుముఖత వ్యక్తం చేశారు. టిడిపి తరఫున ఆయన ప్రచారానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ పార్టీకి సపోర్ట్ ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని చంద్రబాబు ఆహ్వానించారు.

తొలుత అన‌కాప‌ల్లి ఎంపీ సీటు మీద కౌశ‌ల్ ఆశ‌ప‌డిన‌ట్టు ప్ర‌చారం సాగింది. కానీ అక్క‌డ కొణ‌తాల రామ‌కృష్ణ‌కు బెర్త్ క‌న్ఫ‌ర్మ్ కావ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న ప్ర‌చార‌క‌ర్త‌గాన‌యినా టీడీపీలో కొన‌సాగేందుకు అంగీక‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొస్తాలోని ప‌లు జిల్లాల్లో ఆయ‌న ప‌ర్య‌టించి టీడీపీ త‌రుపున ప్ర‌చారం నిర్వ‌హించ‌డానికి స‌ర్వం సిద్ధ‌మ‌యిన‌ట్టు క‌నిపిస్తోంది.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *