Main Menu

ఎన్టీఆర్ కి అండ‌గా వైసీపీ ఎమ్మెల్యే

Spread the love

నంద‌మూరి వంశంతో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న నేత ఆయ‌న‌. అయితే గ‌డిచిన కొన్నాళ్లుగా చంద్ర‌బాబుతో వ‌చ్చిన విబేధాల‌తో టీడీపీకి వ్య‌తిరేకంగా కాలుదువ్వుతున్న నాయ‌కుడు. అయినా తాజాగా ఎన్టీఆర్ తో త‌నుకున్న అనుబంధాన్ని మ‌రోసారి గుర్తు చేశారు. సుదీర్ఘ‌కాలంగా హ‌రికృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ల‌తో స‌న్నిహితంగా మెలిగిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మ‌రోసారి త‌న సంబంధాన్ని అంద‌రికీ చాటుచెబుతూ త‌న సన్నిహిత మిత్రుడికి చేదోడుగా సాగుతున్నారు. గ‌తంలో టీడీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన కొడాలి నాని ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ధోర‌ణి మీద తీవ్ర వ్యాఖ్య‌ల‌తో దూమారం రేపారు. టీడీపీని వీడి జ‌గ‌న్ శిబిరంలోచేరారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున విజ‌యం సాధించారు. అయినా హ‌రికృష్ణ తో సాన్నిహిత్యం, ఎన్టీఆర్ తో ఆయ‌న స్నేహం కొన‌సాగింది.

జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్త మిత్రుల్లో కొడాలి నాని మొదటి స్థానంలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. దానికి త‌గ్గ‌ట్టుగానే కష్టకాలంలో ఉన్న మిత్రుడికి తోడుగా నాని క‌నిపిస్తున్నారు. ఘ‌ట‌న స‌మాచారం అందుకున్న వెంట‌నే హుటీహుటీన బ‌య‌లుదేరిన కొడాలి నాని అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ కి తోడుగానే సాగుతున్నారు. హరికృష్ణ మరణ వార్త తెలుసుకున్న కొడాలి నాని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం ఉకున్హైదరాబాద్‌కు భౌతికకాయాన్ని తరలించే సమయంలోనూ ఎన్టీఆర్ వెంటే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఓదార్చారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించారు. హరికృష్ణ అకాల మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి హరికృష్ణ అని ఆయన చెప్పారు. తనను కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించింది ఆయనేనని, హరికృష్ణ లేనిదే తనకు రాజకీయ జీవితం లేదని కొడాలి నాని చెప్పారు.

చేసిన స‌హాయాన్ని మ‌ర‌చిపోతున్న నేత‌లున్న కాలంలో త‌న స్నేహితుడి కుటుంబంగానే కాకుండా, త‌న‌కు రాజ‌కీయంగా తోడు, నీడ‌గా ఉన్న నాయ‌కుడి అంతిమ‌ద‌శ‌లో ద‌గ్గ‌రుండి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న కొడాలి నాని తీరు ప‌లువురు ని ఆక‌ట్టుకుంటోంది.






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *