కొడాలి నాని మోజు పడ్డారు

kodali nani
Spread the love

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మోజుపడ్డారు. అది ఆయన సొంత నియోజకవర్గంలో ఆసక్తిని పెంచింది. చివరకు ఆయన ఆశలు ఫలించాలి. అనుకున్నది సాధించారు. కోరుకుని మరీ ఫ్యాన్సీ నెంబర్లు సాధించారు. గుడివాడ ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల టెండర్ ప్రక్రియలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఏపి16 డిఎస్ 9999, 7777 నెంబర్ల కోసం ఆయన పోటీ పడ్డారు. చివరకు ఆ రెండూ నెంబర్లు ఎమ్మెల్యే చేజిక్కించుకున్నారు.

ఈసారి ఎలాగైనా 9999 నెంబర్‌ను ఎమ్మెల్యేకు దక్కకుండా చేయాలని కొంతమంది రాజకీయ నాయకులు రెండు రోజులుగా పలువురు పారిశ్రామికవేత్తలను సిద్ధం చేసినప్పటికీ టెండర్ వేసే సమయానికి ఎవరూ రాకపోవడంతో రూ.50 వేల మొత్తానికి కొడాలి నాని దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. అలాగే 7777 నెంబర్‌ను కూడా రూ.30,500కు చేజిక్కించుకున్నారు. అంతేగాక 5555 నెంబర్ రూ.2.05 లక్షలు, 6666 నెంబర్ కోసం తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ గుత్తా చంటి పోటీపడినప్పటికీ ఆయనకు దక్కలేదు. ఈ నెంబర్ రూ.1.86 లక్షలు పలికింది. 8888 నెంబర్ రూ.86 వేలకు దక్కించుకున్నారు.

ఈ వేలం ప్రక్రియ గుడివాడ వాసుల్లో చర్చనీయాంశం అయ్యింది. పోటీపడతామని చెప్పిన చాలామంది పెద్ద తలకయాలు ఆఖరి నిమిషంలో ఎమ్మెల్యేకు ఎదురులేకుండా పోవడం విశేషంగా మారింది.






Related News

jaleelkhan

ఆ ఎమ్మెల్యేకి హ్యాండివ్వబోతున్న చంద్రబాబు

Spread the loveఏపీ రాజధాని రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులోనూ బెజవాడ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అందుకుRead More

MLA Alla Ramakrishna Reddy (2)

వైసీపీ ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు

Spread the loveఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రుష్ణారెడ్డికిRead More

  • కన్నా కమల దళపతి కావడానికి కారణం అదేనా?
  • జనసేనకు కన్నం కొట్టి..వైసీపీ కి?
  • ఆయన్ని మార్చేసిన జగన్
  • మళ్లీ నీరుగారిపోయిన జగన్ ఛాంబర్
  • టీడీపీ బలం మీద దెబ్బకొట్టిన జగన్
  • జనసేనకి లోకేష్ సవాల్
  • బాబుకి మరో దెబ్బ: టీడీపీ నుంచి జంపింగ్
  • వైసీపీ వైపు క‌న్నా క‌న్ను
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *