Main Menu

బట్టబయలయిన టీడీపీ నేతల కిడ్నీ రాకెట్

Spread the love

కాదేదీ కవితకనర్హం అన్నట్టుగా ఏపీలో సకల అరాచకాలకు అధికార పార్టీ కేంద్రం అవుతోంది. ఆ పార్టీ కార్యకర్తలు కేంద్రం స్థానంగా ఉంటున్నారు. నాయకులు సూత్రధారులుగా కనిపిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో బయటపడిన కిడ్నీ రాకెట్ లోకూడా టీడీపీ పెద్దలదే ప్రధాన పాత్రగా బయటపడింది. అందులో కొందరిని అరెస్ట్ చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గిరాల గ్రామానికి చెందిన కొడాలి బాబురావు వృత్తిరీత్యా మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో 2012లో జరిగిన హత్య కేసులో ముద్దాయిగా అప్పుల పాలయ్యాడు. అప్పటి నుంచి కిడ్నీ రాకెట్‌పై దృష్టి కేంద్రీకరించి అక్రమంగా డబ్బు సంపాదించవచ్చనే దురాశతో 2016లో బొమ్మిశెట్టి రంగారావు అనే వ్యక్తికి కిడ్నీ ఇప్పించాడు. అప్పట్లో నరసరావుపేట ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో సంబంధిత సర్ట్ఫికెట్ల కోసం రంగారావు బంధువు నాగమల్లేశ్వరరావు, పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కపిలవాయి విజయకుమార్ సిఫార్సుతో ఎమ్మార్వో కార్యాలయం నుంచి సర్ట్ఫికెట్ పుట్టించారు. కరాదేవి అనే మహిళకు రూ. 5లక్షలు ఎరవేసి కిడ్నీని రంగారావుకు అందజేశారు. ఇందుకుగాను బాబురావుకు రూ. 50వేలు ముట్టాయి. ఇలా బాబురావు, నాగమల్లేశ్వరరావుకు మధ్య పరిచయం ఏర్పడింది. ఇది తెలుసుకున్న తెనాలికి చెందిన శశాంక్ అనే వ్యక్తి డబ్బు ఆశతో బాబురావును సంప్రదించగా అతని కిడ్నీని కోట శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఇప్పించారు. రూ. 60వేలు కమిషన్ సహా 5లక్షల 70వేల రూపాయలు అతని నుంచి వసూలు చేశారు. తరువాత బేతపూడి నరేష్ అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతూ బాబురావును సంప్రదించాడు. బాబురావు అతన్ని శివనాగమల్లేశ్వరరావు వద్దకు పంపాడు. అదే సమయంలో దుర్గి మండలానికి చెందిన వెంకటేశ్వర్లు నాయక్ తనవద్దకు రాగా గుంటూరుకు చెందిన శివనాగేశ్వరరావుకు కిడ్నీ ఇచ్చేందుకు రూ. 5లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ. 2లక్షలు తీసుకుని నరసరావుపేటకు చెందిన అరవపల్లి ఏడుకొండలు, తెనాలి ఐతానగర్‌కు చెందిన నీల ప్రసాద్‌బాబు అలియాస్ బాబిలతో కలిసి నాగమల్లేశ్వరరావు, డ్రైవర్ రవి, వెంకటేశ్వర్లు నాయక్, అతని భార్య ఆధార్ కార్డులను మార్చేసి, నకిలీవి తయారుచేసి తహశీల్దారు కార్యాలయంలో అందజేశారు. కాగా గుంటూరు వేదాంత ఆసుపత్రి ఉదంతంతో వెలుగులోకి వచ్చిన వెంకటేశ్వర్లు నాయక్‌కూ రూ. 7.5లక్షల అప్పు ఉంది.

ఇది తీర్చే దారిలేక కిడ్నీ అమ్ముకోవాలని నిర్ణయించాడు. ఇందుకు తన స్నేహితుడు రమావత్ మంత్రునాయక్ మాటలు నమ్మి కిడ్నీ వ్యాధితో నరసరావుపేట మహాత్మాగాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివానాయక్‌కు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. రక్త పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ అర్వపల్లి ఏడుకొండలు గ్రూపు కలవలేదని, ఎలాగూ కిడ్నీ ఇవ్వదలచినందున గుంటూరులో చిగురుపాటి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో తహశీల్దారు కార్యాలయంలో నకిలీ ఆధార్ కార్డులు సమర్పించి కపిలవాయి విజయకుమార్‌తో సిఫార్సు చేయించుకుని వేదాంత ఆసుపత్రికి చేరుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొడాలి బాబురావు, నీలా ప్రసాద్‌లను తెనాలిలో అరెస్టు చేసి నకిలీ ఆధార్ కార్డుల తయారీకి వినియోగించే ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. నరసరావుపేటలో ఇండ్ల నాగమల్లేశ్వరరావు, అరవపల్లి ఏడుకొండలును అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన రమావత్ మంత్రునాయక్, సత్తెనపల్లికి చెందిన కుందుర్తి బ్రహ్మం, గుంటూరు కొరిటెపాడుకు చెందిన మంగినపూడి రవి, చంద్రవౌళినగర్‌కు చెందిన చిగురుపాటి శివనాగేశ్వరరావు పరారీలో ఉన్నారు.






Related News

ఎన్టీఆర్ సినిమా అడ్డుకోండి చంద్ర‌బాబు పిలుపు

Spread the loveఏపీ సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవాల‌న్నారు. టీడీపీ శ్రేణుల‌తో నిర్వ‌హించిన టెలీకాన్ఫ‌రెన్స్ లోRead More

అంబ‌టికి జ‌గ‌న్ ఝ‌ల‌క్!

Spread the loveవైసీపీ లో గ‌ట్టిగా పార్టీ వాణీ వినిపించే నేత‌ల్లో అంబ‌టి రాంబాబు ఒక‌రు. ఆది నుంచి జ‌గ‌న్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *