Main Menu

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the love

తెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతుండ‌గా, తాను రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామంటూ తెలంగాణా సీఎం చెప్పేశారు. చంద్ర‌బాబు గురించి అన్ని విష‌యాలు విజ‌య‌వాడ చెబుతాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసేశారు. దాంతో కేసీఆర్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో కాక రేపుతోంది. టీడీపీ నేత‌లు మాట‌ల దాడి పెంచారు. కేసీఆర్ అడుగుపెడితే స‌త్తా చాటుతామంటూ గోరంట్ల బుచ్చ‌య్య హెచ్చ‌రిస్తే, కేసీఆర్ రాక త‌మ‌కే ఉప‌యోగం అని టీడీపీ నేత‌లు దేవినేని ఉమా వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు.

అదే స‌మ‌యంలో కేసీఆర్ ఎవ‌రికి మ‌ద్ధ‌తిస్తారోన‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. వాస్త‌వానికి తెలంగాణాలో ప్ర‌ధానంగా గ్రేట‌ర్ ప‌రిధిలో టీడీపీకి వ్య‌తిరేకంగా వైసీపీ, జ‌న‌సేన కూడా టీఆర్ఎస్ కి తోడుగా నిలిచాయి. చంద్ర‌బాబు వ్య‌తిరేకులంతా, సీమాంధ్రులు సైతం కేసీఆర్ కారు వెంట ప‌రుగులు తీశారు. భారీ మెజార్టీల‌తో కూక‌ట్ ప‌ల్లి, శేరిలింగ‌ప‌ల్లిలో కూడా విజ‌యాలు క‌ట్ట‌బెట్టారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ మ‌ద్ధ‌తు జ‌గ‌న్, ప వ‌న్ లో ఎవ‌రికి ద‌క్కుతుందోన‌నే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది.

అయితే తాజాగా కేసీఆర్ కి అత్యంత స‌న్నిహితంగా మెలుగుతున్న టీఆర్ఎస్ న‌మ్మ‌క‌మ‌యిన మిత్రుడు ఎంఐఎం అధినేత త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేసేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌ద్ధ‌తు ఎవ‌రిక‌న్న‌ది తేల్చేశారు. ఓవైపు అస‌దుద్దీన్ , తాను క‌లిసి దేశ‌మంతా ప‌ర్య‌టిస్తామ‌ని కేసీఆర్ చెబుతుండ‌గా మ‌రో వైపు ఏపీలో త‌న మిత్రుడు జ‌గ‌న్ కోసం ప్ర‌చారం చేస్తానంటూ అస‌దుద్దీన్ వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిగా మారింది. త్వ‌ర‌లో కేసీఆర్ మ‌ద్ధ‌తు కూడా జ‌గ‌న్ కే ఖాయ‌మ‌నడానికి గ‌ట్టి ఆధారంగా మారింది. అయితే కేసీఆర్ మ‌ద్ధ‌తు ఏ రూపంలో ఉంటుంది, ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది త్వ‌ర‌లో తేల‌బోతోంది.






Related News

పురందేశ్వ‌రి పోటీ ఎక్క‌డ‌?

Spread the loveఏపీ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. సంక్రాంతి త‌ర్వాత మ‌రింత జోరుగా మార్పులు, చేర్పులు ఉంటాయ‌ని చెబుతున్నారు. అందుకుRead More

బుద్ధా వెంక‌న్న వ్యూహాత్మ‌కంగానే వైసీపీలోకి…!

Spread the loveటీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వ్య‌వ‌హారం ఆది నుంచి చ‌ర్చ‌నీయాంశ‌మే. దుర్గ గుడి వ్య‌వ‌హారాల ఉంచి టీడీపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *